తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup 2023 Rohith Sharma : 'కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్​ ఇది.. వాళ్లు అద్భుతం చేశారు' - వన్డే వరల్డ్ కప్​ 2023 ఇండియా మ్యాచ్​లు

ODI World Cup 2023 Rohith Sharma : వన్డే ప్రపంచకప్​లో టీమ్​ఇండియా డబుల్ హ్యట్రిక్​ను నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం హర్షం వ్యక్తం చేసిన రోహిత్​ ఇలా అన్నాడు.

ODI World Cup 2023 Rohith Sharma : ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్షే..
ODI World Cup 2023 Rohith Sharma : ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్షే..

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 10:48 AM IST

ODI World Cup 2023 Rohith Sharma: వన్డే ప్రపంచకప్​లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించి డబుల్ హ్యట్రిక్​ను నమోదు చేసుకుంది. లఖ్​నవూ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా 100 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్​ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. టీమ్​ఇండియా మొదట బ్యాటింగ్​లో కీలక సమయాల్లో వికెట్లను కొల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయినప్పటికీ బౌలింగ్​లో ప్లేయర్లు చెలరేగడం వల్ల 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆఫ్​ ది మ్యాన్​గా రోహిత్​ శర్మ నిలిచాడు. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్​ అనంతరం రోహిత్​ మీడియాతో అన్నాడు.

"జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్​ ఇది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అనుభవజ్ఞులైన మన ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడి జట్టును గెలిపించటంలో ముందుంటారని విషయం ఈ మ్యాచ్​లో మరోమారు రుజువైంది. పట్టుదలగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ఆడిన తీరు వేరు.. ఈ మ్యాచ్​లో చేసిన పోరాటం వేరు. ముందు ఐదు గేముల్లో లక్ష్య ఛేదనకే దిగాం. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్​ చేయాల్సి వచ్చింది. బౌలింగ్​కు అనుకూలంగా ఉన్న ఈ వేదికపై.. ఇంగ్లాండ్​ అద్భుత బౌలింగ్​ను ఎదుర్కొని మరీ ఈ మాత్రం స్కోరు చేయగలిగాం. అయితే బ్యాటింగ్​లో అనుకున్నంతమేర రాణించలేదనే చెప్పాలి. నాతో పాటు మరికొందరు అనవరసరంగా వికెట్లను సమర్పించారు. మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఓ 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది." అని రోహిత్ శర్మ అన్నాడు.

"నామమాత్రపు స్కోరుకు పరిమితమైన వేళ భారత్ బౌలింగ్ విభాగం అద్భుతం చేసింది. ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్​పై ఒత్తిడిని పెంచారు. పిచ్ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. స్వింగ్​తో పాటు పిచ్​ నుంచి కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇంగ్లాండ్​కు బ్యాటింగ్​ చాలా కష్టంగా మారిపోయింది. మా బౌలర్ల అనుభవం కూడా మాకు కలిసొచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ కీలక అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బ్యాటర్లు రాణించి స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాల్సిందే. అప్పుడే బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్యం మరీ తక్కువగా ఉంటే ఆ ఒత్తిడి బౌలింగ్‌పైనా పడుతుంది." అని రోహిత్ శర్మ అన్నాడు.

ODI World Cup 2023 : సెమీస్​ రేస్​.. రెండు జట్ల లెక్క తేలిపోయింది!

Ind Vs Eng World Cup 2023 : షమీ మెరుపులు.. ఇంగ్లాండ్​పై టీమ్ఇండియా ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details