ODI World Cup 2023 :వరల్డ్ కప్ - 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు అదరగొట్టేశారు. ఉప్పల్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగి శతకాల మోత మోగించారు. కుశాల్ మెండిస్ ( 77 బంతుల్లో 122; 14×4, 6×6), సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11×4,2×6) ధనాధన్ ఇన్నింగ్స్ బాది జట్టుకు భారీ స్కోరును అందించారు. ఓపెనర్ నిశాంక (61 బంతుల్లో 51; 7×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తంగా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. .
అయితే పటిష్ట పేస్ దళం ఉన్న పాకిస్థాన్‌పై ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ భారీ స్కోర్‌తో టీమ్ ఇండియా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ అయిపోయింది. శ్రీలంక దీన్ని బద్దలు కొట్టేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో పాక్‌పై హైయెస్ట్ స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. హరీస్ రాఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు