తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI WC 2023: వరల్డ్​ కప్​ ఆడేందుకు పాక్​ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో ఇండియా-పాక్​ మ్యాచ్‌ ? - వన్డే ప్రపంచ కప్​ 2023 ఇండియా vs పాకిస్థాన్​

2023 ప్రపంచకప్​లో భాగంగా ఈ ఏడాది జరగనున్న మ్యాచ్​లన్నింటినీ పాకిస్తాన్‌ జట్టు.. భారత్​లోని నిర్థిష్టమైన వేదికల్లోనే ఆడేందుకు సుముఖత చూపించినట్లు సమాచారం. ఇందులో భాగంగా హైదరాబాద్‌, చెన్నై పేర్లు గట్టిగా వినపడుతున్నాయని టాక్​.

odi world cup 2023
odi world cup 2023 india vs pak

By

Published : May 10, 2023, 7:13 PM IST

ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్​ కోసం సన్నాహాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో భాగంగా జరగనున్న మ్యాచ్​లన్నింటినీ.. పాకిస్థాన్​ జట్టు.. హైదరాబాద్​తో పాటు చెన్నైలో ఆడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ.. పాక్‌ మాత్రం హైదరాబాద్‌లోనే టీమ్​ఇండియాతో మ్యాచ్​ ఆడేందుకు సుముఖత చూపిస్తోందని సమాచారం.

World cup 2023 : టోర్నీ నిర్వహణకు ఐసీసీ క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికీ.. బీసీసీఐ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాతనే.. బీసీసీఐ ఈ షెడ్యూల్‌ను అనౌన్స్‌ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా, ఇదివరకే ఐసీసీ అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్‌ జరుగుతుందని ప్రకటించింది. మరోవైపు అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇక టోర్నీ ఫైనల్‌ మ్యాచ్​ను నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ అభిప్రాయపడుతోంది.

Ind Vs Pak WC 2023 : ఇక ప్రముఖ క్రికెట్ న్యూస్​ వెబ్​సైట్​ క్రిక్​బజ్​ తెలిపిన సమాచారం ప్రకారం.. పాకిస్థాన్​తో టీమ్​ఇండియా ఆడనున్న తొలి మ్యాచ్​ అక్టోబర్ 15న జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్​లో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇండియాతో ఆడనున్న మ్యాచ్​ను అహ్మదాబాద్​లో నిర్వహించే విషయంపై పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

India vs Pakistan WC : మరోవైపు ఇక జరగనున్న అన్నీ మ్యాచ్​లను పాకిస్థాన్.. హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులలో ఆడాల్సి ఉన్నప్పటికీ.. అహ్మదాబాద్‌, బెంగళూరులో ఆడేందుకు మాత్రం ఇష్టపడటం లేదని సమాచారం. దీంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ దాదాపుగా హైదరాబాద్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాచారం. అంతే కాకుండా ఈ ఏడాది జరగనున్న మ్యాచ్​లకు పెద్ద పెద్ద సిటీలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, ఇండోర్, ధర్మశాల, గువహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబయి లాంటి ప్రదేశాలు ఈ ఏడాది వరల్డ్​ కప్​కు ఆతిథ్యం ఇవ్వన్నున్నాయి. ప్రతి టీమ్ 9 లీగ్ మ్యాచ్​లు ఆడనున్న నేపథ్యంలో.. దాదాపు ప్రతి సిటీలోనూ మ్యాచ్​లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ప్రపంచ కప్​లో 10 జట్లు ఆడనుండగా.. మొత్తం 48 మ్యాచ్​లు జరుగుతాయి.

ABOUT THE AUTHOR

...view details