ODI World Cup 2023 IND VS SL :ఈ మెగాటోర్నీలో ముందుకు సాగే కొద్దీ టీమ్ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లందరూ ఊపందుకున్నారు. హార్దిక్ పాండ్య దూరం కావడం వల్ల.. తుది జట్టులో చోటు దక్కించుకున్న ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా రాణిస్తున్నారు.
- ఒక్క శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రమే కాస్త ఆశించిన స్థాయిలో లేదు. టోర్నీలో ఆరు మ్యాచులు ఆడిన అతడు.. 134 పరుగులే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఇప్పుడు లంకపై అతడు రాణించకపోతే.. సత్తా చాటకపోతే.. ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తుంది.
- ఓపెనర్ శుభ్‌మన్ బాగానే ఆడుతున్నప్పటికీ.. భారీ ఇన్నింగ్స్ ఆడట్లేదు.
- కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌తో ఉన్నాడు. జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.
- కోహ్లీ రీసెంట్గా ఇంగ్లాండ్‌పై డకౌట్ అయినా.. మిగతా మ్యాచుల్లో అతడి ఫామ్ బాగానే ఉంది.
- రాహుల్ కూడా మిడిలా ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
- బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడె పిచ్‌పై భారీ స్కోరు చేయడానికి మంచి అవకాశం ఉంది.
- బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు కూడా లేవు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతున్నాడు. బుమ్రా, కుల్‌దీప్, జడేజా నిలకడగా రాణిస్తున్నారు. అశ్విన్‌కు తీసుకునే అవకాశముందని అంటున్నారు.
ఆరు మ్యాచ్‌లాడి రెండే నెగ్గిన లంక.. ఈ మ్యాచ్‌లో పరాజయం అందుకుంటే.. సెమీస్ రేసు నుంచి దాదాపుగా వైదొలిగనట్లు అవుతుంది. టోర్నీలో ఇంగ్లాండ్‌పై తప్ప అంతా పేలవ ప్రదర్శన చేసింది.
కెప్టెన్ శానకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం అయ్యారు. అది జట్టుకు పెద్ద దెబ్బ తీసింది. మిగతా ఆటగాళ్లలో నిలకడ లేదు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన కుశాల్ మెండిస్.. శనక స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక రాణించలేకపోతున్నాడు. నిశాంక పర్వాలేదనిపిస్తున్నాడు.