తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అతడికే ఇవ్వాలి: గావస్కర్ - రోహిత్ శర్మ

Next Test Captain: టెస్టు కెప్టెన్సీ వీడ్కోలు పలికి అందరినీ షాక్​కు గురిచేశాడు విరాట్ కోహ్లీ. టీమ్​ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చిన అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే తదుపరి కెప్టెన్​గా ఎవరు ఉండాలనేదానిపై ఓ క్రికెటర్​ పేరు సూచించారు సునీల్ గావస్కర్​. అతడు ఎవరంటే..

Gavaskar
Rishabh Pant

By

Published : Jan 17, 2022, 8:27 AM IST

Next Test Captain: విరాట్ కోహ్లీ వారసత్వాన్ని రిషభ్ పంత్ కొనసాగించాలని అన్నాడు లెజెండరీ క్రికటర్ సునీల్ గావస్కర్. వికెట్​ కీపర్​ పంత్​ను తదపరి టెస్టు కెప్టెన్​ చేయాలని అన్నాడు. ఆ బాధ్యత అతడిని అన్ని ఫార్మాట్లలో ఉత్తమ క్రికెటర్​గా తీర్చిదిద్దుతుందని చెప్పాడు.

రిషభ్ పంత్

"భారత క్రికెట్​ను ఇక నుంచి ముందుకు తీసుకెళ్లేది ఎవరనేదానిపై సెలక్షన్​ కమిటీలో తీవ్రమైన జరగుతుంది. అయితే అది.. అన్ని ఫార్మాట్లలో ఆటోమెటిక్​గా ఎంపిక చేసుకోగలిగే వ్యక్తి అయ్యుండాలి. నా వరకు టీమ్​ఇండియా తదుపరి కెప్టెన్​గా రిషభ్​ పంత్ ఉండాలి. అందుకు ఒకటే కారణం ఉంది. రిక్కీ పాంటింగ్​ నుంచి ముంబయి ఇండియన్స్​ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్​ బ్యాటింగ్​లో ఎలాగైతే మార్పు వచ్చిందో.. అలానే కెప్టెన్​ బాధ్యత పంత్​ను మరింత నాణ్యమైన బ్యాటర్​గా మారుస్తుంది."

- సునీల్ గావస్కర్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం సుదీర్ఘ ఫార్మాట్​లో కెప్టెన్సీకి గుడ్​బై చెప్పాడు విరాట్. దీంతో సారథిగా విజయవంతంగా కొనసాగిన అతడి ఏడేళ్ల ప్రస్థానానికి తెరపడింది. ఈ నేపథ్యంలోనే టీమ్​ఇండియా తదుపరి కెప్టెన్​ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఆ సామర్థ్యం అతడిలో ఉంది..

దక్షిణాఫ్రికాలో చేసిన శతకాల్లాంటివి మరెన్నో సాధించడానికి కెప్టెన్సీ బాధ్యత పంత్​కు దోహదం చేస్తుందని గావస్కర్ అన్నాడు. "నారి కాంట్రాక్టర్​ గాయపడిన తర్వాత జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. టైగర్​ పటౌడీ 21 ఏళ్లకే కెప్టెన్​ అయ్యాడు. ఆ తర్వాత అద్భుతాలు చేశాడు. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ సారథిగా పంత్​ సామర్థ్యం ఏంటో మనం చూశాం. భారత క్రికెట్​ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం అతడికి ఉందని నమ్ముతున్నా. జట్టును అతడు ఆసక్తికరంగా మారుస్తాడు." అని గావస్కర్ అన్నాడు.

విరాట్ కోహ్లీ, పంత్

విరాట్ అనంతరం వన్డే సారథి రోహిత్​ శర్మ.. టెస్టు కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. అజింక్య రహానె స్థానంలో టెస్టు వైస్​ కెప్టెన్​గా ఇటీవలే ఎంపికయ్యాడు హిట్​మ్యాన్. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో కోహ్లీ డెప్యూటీగా కేఎల్ రాహుల్ ఉన్నాడు.

ఇవీ చూడండి:

Virat Kohli Test Captaincy: సారథి.. సరిలేరు నీకెవ్వరూ!

ఇందుకే కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ వదులుకున్నాడా?

'పంత్‌కు కాస్త భరోసా ఇస్తే చెలరేగి ఆడతాడు'

ABOUT THE AUTHOR

...view details