తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2023, 5:08 PM IST

Updated : Jan 24, 2023, 5:33 PM IST

ETV Bharat / sports

సెంచరీలతో దుమ్మురేపిన రోహిత్​, గిల్​.. కివీస్​ ముందు భారీ లక్ష్యం

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా అద్బుత ప్రదర్శన చేసింది. 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసి.. కివీస్​ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

New Zealand tour of India 2023
New Zealand tour of India 2023

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుభ్​​మన్​ గిల్ (112) శతక్కొట్టారు. హార్దిక్​ పాండ్య(50), విరాట్​ కోహ్లీ(36), శార్దుల్​ ఠాకూర్​(25) రాణించారు. ఇషన్​(17), సూర్యకుమార్(14), వాషింగ్టన్ సుందర్ (9) ఫర్వాలేదనిపించారు. కుల్దీప్​ యాదవ్(3*), ఉమ్రాన్​ మాలిక్(2*) పరుగులు చేశారు. న్యూజిలాండ్​ బౌలర్లు జాకబ్​(3), బ్లెయిర్​(3) చొప్పున వికెట్లు తీశారు. బ్రేస్​వెల్​ (1) వికెట్ పడగొట్టాడు.

నిరీక్షణకు తెరదించిన రోహిత్​ శర్మ..
మూడేళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత సారథి రోహిత్​ శర్మ (101) వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా సెంచరీలో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్‌లో రోహిత్‌కిది 30వ శతకం. సెంచరీ సాధించిన వెంటనే ఔటై పెవిలియన్‌కు చేరాడు.

  • వన్డేల్లో అత్యధిక సెంచరీల సాధించిన బ్యాటర్లలో రోహిత్‌ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (30)తో కలిసి సమంగా మూడో స్థానంలో నిలిచాడు.
  • మరో ఓపెనర్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్‌పై తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.

రికార్డుకెక్కిన గిల్..
ఈ మ్యాచ్​లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112) కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో దుమ్మురేపిన గిల్‌.. కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్‌ల మూడో వన్డేలోనూ సెంచరీ చేశాడు.

  • తక్కువ ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వన్డే శతకాలు బాదిన ఐదో క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్ రికార్డూలకెక్కాడు. భారత్‌ నుంచి గిల్​ తొలి ఆటగాడు కావడం విశేషం. 21 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు బాదాడు. పాక్‌ బ్యాటర్ ఇమామ్‌ ఉల్ హక్‌ కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు.
  • ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గానూ గిల్ రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు బాదాడు. అంతర్జాతీయంగా బాబర్‌ అజామ్ (360)తో సమంగా నిలిచాడు.
  • వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా ఇన్ని పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్‌ తన 2019లో తన కెరీర్‌ను న్యూజిలాండ్‌పై ప్రారంభించాడు.
Last Updated : Jan 24, 2023, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details