తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Nz: ఏకైక టీ20లో టీమ్​ఇండియా ఓటమి - క్రికెట్ లైవ్

India women cricket: కివీస్ చేతిలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. టీ20లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ind vs nz
ఇండియా న్యూజిలాండ్

By

Published : Feb 9, 2022, 9:02 AM IST

INDW VS NZW: టీమ్​ఇండియా అమ్మాయిలు.. న్యూజిలాండ్​తో ఏకైక టీ20లో ఓడిపోయారు. బుధవారం ఉదయం క్వీన్స్​టౌన్​ వేదికగా ఈ మ్యాచ్​ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి న్యూజిలాండ్​కు బ్యాటింగ్ అప్పగించింది టీమ్​ఇండియా. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 155/5 స్కోరు చేసింది కివీస్. పూజా, దీప్తి తలో రెండు వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్ ఓ వికెట్ తీసింది.

ఇండియా న్యూజిలాండ్ టీ20 రిపోర్ట్

అనంతరం భారత్, ఛేదనను బాగానే ఆరంభించినప్పటికీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసి 137 పరుగులు మాత్రమే చేసింది.

ఈ టీ20లో టీమ్​ఇండియా ఓడినప్పటికీ.. ఫిబ్రవరి 12 నుంచి ఐదు వన్డేల సిరీస్​లో న్యూజిలాండ్​తో తలపడనుంది. ఆ తర్వాత మార్చి 4 నుంచి వన్డే ప్రపంచకప్​లో పాల్గొనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details