తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరులో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ

New NCA in Bengaluru: బెంగళూరులో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. వచ్చే ఏడాదికల్లా ఈ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఇందులో దేశవాళీ మ్యాచులు నిర్వహించేందుకు అనువుగా మూడు మైదానాలను తయారు చేయనున్నారు.

New NCA in Bengaluru
నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ

By

Published : Feb 14, 2022, 9:43 PM IST

New NCA in Bengaluru: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బీసీసీఐ సెక్రెటరీ జై షాతో కలిసి.. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోమవారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాదికల్లా ఈ స్టేడియం అందుబాటులోకి రానుంది. 99 ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకుని ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దేశవాళీ మ్యాచులు నిర్వహించేందుకు అనువుగా మూడు మైదానాలను తయారు చేయనున్నారు.

'కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ పనులకు బెంగళూరులో నేడు భూమి పూజ చేశాం' అని గంగూలీ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు. 'బీసీసీఐ నేతృత్వంలో కొత్త క్రికెట్ అకాడమీకి పునాది రాయి పడింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు.. భారత్‌లో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో మేమంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయం ఇది' అని జై షా ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, ట్రెజజర్‌ అరుణ్ ధూమల్‌, జాయింట్ సెక్రెటరీ జయేశ్‌ జార్జ్‌, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్సీఏ)ని నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకుగాను బీసీసీఐ.. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ)కు అద్దె చెల్లిస్తోంది. ఇందులో అవుట్‌డోర్‌ స్టేడియం, ఇండోర్ స్టేడియంతో పాటు ఆధునిక వ్యాయామశాల వంటి సదుపాయాలున్నాయి.

ఇదీ చదవండి:IPL 2022: సీఎస్కే.. ఈ సారి వేలంలో రూటు మార్చిందిగా!

ABOUT THE AUTHOR

...view details