బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఆడిన గత వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ ఇషాన్ కిషాన్‌కు షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో గువాహటిలో జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో అతడికి అవకాశం ఇవ్వలేదు. అలాగే శ్రీలంకతో మూడో టీ20లో మెరుపు సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను సైతం బెంచ్‌కే పరిమితం చేశారు. ఇంకా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా మొదటి వన్డేలో చోటు దక్కలేదు. ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను కొనసాగించేందుకు ఇషాన్ కిషన్‌ను, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్‌ను ఆడించేందుకు సూర్యకుమార్‌ను పక్కనబెడుతూ టీమ్ మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
IND VS SL: వాళ్లిద్దరికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. మేనేజ్మెంట్పై నెటిజన్స్ ఫైర్ - టీమ్ఇండియా శ్రీలంక సిరీస్
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ ప్రియుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
దీంతో క్రికెట్ ప్రేమికులు, మాజీలు.. తుది జట్టు ఎంపిక చేసిన విషయమై టీమ్ మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వీరిద్దరికి ఛాన్స్ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బౌలింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగారు. టీ20 సిరీస్‌లో ఆడిన హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, చహల్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇదీ చూడండి:సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను.. మరో సెంచరీ చేస్తే టాప్ లిస్టులోకి..