తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐపై ఫ్యాన్స్​ ఫైర్​.. అలా చేయడం అన్యాయమంటూ.. - జింబాబ్వే

జింబాబ్వే పర్యటనకు ధావన్​ను తప్పించి కేఎల్​రాహుల్​ను కెప్టెన్​గా ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు.

.
.

By

Published : Aug 12, 2022, 11:04 AM IST

టీమ్‌ఇండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి గతరాత్రి కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి బీసీసీఐ సెలెక్టర్లు ఇదివరకే జట్టును ప్రకటించగా దానికి శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫిట్‌నెస్ సంపాదించడంతో.. అతడిని కెప్టెన్‌గా చేసి ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చారు. దీంతో అటు అభిమానులు, ఇటు నెటిజన్లు.. సెలెక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. జింబాబ్వేతో టీమ్‌ఇండియా ఈనెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే.

ఒకవేళ రాహుల్‌ను ఈ పర్యటనకు ఎంపిక చేయాల్సి వస్తే బీసీసీఐ ముందే జట్టును ప్రకటించకుండా ఉండాల్సిందని, అలా కాకపోతే ఎలాగూ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు కాబట్టి.. అతడిని అలాగే కొనసాగించాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఒక విధంగా ఇది ధావన్‌ను అవమానించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ధావన్‌ విండీస్‌ పర్యటనలో 3-0తో సిరీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌ భారత జట్టులో చాలా రోజుల తర్వాత చేరుతున్నాడు. భారత టీ20లీగ్‌లో లఖ్‌నవూ జట్టుకు కెప్టెన్సీ చేసిన అతడు తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు ముందు కోలుకున్నా.. మళ్లీ కరోనా సోకడంతో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించడంతో రాహుల్‌ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, అతడు అన్ని ఫార్మాట్లలోనూ తొలి ప్రాధాన్య వైస్‌ కెప్టెన్‌ కావడంతో ఇప్పుడు జట్టు పగ్గాలు దక్కాయి.

ఇదీ చూడండి: ఆ హీరోయిన్​ను చూస్తే జాలేస్తుంది.. ఫేమ్ కోసం మరీ ఇంతలా.. పంత్ ఆవేదన!

ABOUT THE AUTHOR

...view details