అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. 2022 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధికంగా 101,566 మంది ప్రేక్షకులు హాజరైనందుకు ఈ స్టేడియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదివారం తెలిపారు. ఇంతకుముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొతెరాగా పిలిచే ఈ స్టేడియానికి 110,000 సామర్థ్యం ఉంది. అయితే ఇది మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం కన్నా పెద్దది. దానికి.. అధికారిక లెక్కల ప్రకారం 1,00,024 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం అంతకంటే 10,000 మంది ఎక్కువ.
'ఈ స్టేడియం గిన్నిస్ రికార్టులో చోటు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో గర్వకారణం. ఇది సాధ్యమయ్యేలా చేసిన మా అభిమానులకు కృతజ్ఞతలు' అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు.