తెలంగాణ

telangana

ETV Bharat / sports

2024 IPL సీజనే ధోనీకి చివరిది!- తర్వాత ఆర్మీలోకి కెప్టెన్ కూల్! - ఎంఎస్​ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్

MS Dhoni After Retirement Plans : చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతలుగా, క్రికెట్ అకాడమీ నిర్వహించడం, కోచ్​గా మారడం, లేదా వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. అయితే ఎంఎస్​ ధోనీ ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఏమి చేస్తారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్​ రిప్లై ఇచ్చారు.

MS Dhoni After Retirement Plans
MS Dhoni After Retirement Plans

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 8:25 PM IST

Updated : Dec 22, 2023, 8:38 PM IST

MS Dhoni After Retirement Plans : క్రికెట్​లో తనదైన శైలిలో ఆకట్టుకుంటూ కూల్​ కెప్టెన్​గా పేరు తెచ్చుకున్నారు ఎంఎస్​ ధోనీ. టీమ్​ఇండియాకు టీ20, వన్డే వరల్డ్​కప్​తో ఛాంపియన్​ ట్రోఫీ అందించారు. ఐపీఎల్​లో చైన్నై సూపర్​ కింగ్స్​కు ఐదు ​టైటిళ్లను సాధించిపెట్టారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్నారు. ఇక 2024 ఐపీఎల్​ సీజనే ధోనీకి చివరిదని అంతా భావిస్తున్నారు. అయితే ఈ తర్వాత ఆయన ఏమి చేస్తారనే ఆసక్తి మొదలైంది. ఈ విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

'ఇప్పటివరకు ఆ విషయం (ఐపీఎల్ రిటైర్మెంట్) గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఇంకా నేను క్రికెట్ ఆడుతున్నా. ఐపీఎల్​లో సీఎస్​కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే నాకూ ఆస్తికరంగానే ఉంది. అయితే, ఆర్మీలో మరింత సమయం గడపాలని ఉంది. గత కొన్నేళ్లుగా నేను ఎక్కువ సమయం వెచ్చిచలేదు. ఆ లోటును పూరించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని ధోని సమాధానం ఇచ్చారు.

భారత్ క్రికెట్​కు ఎంఎస్​ ధోనీ అందించిన సేవలకుగానూ 2011లో దేశ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్​ ర్యాంకు పొందారు. 2015లో ట్రైనింగ్​ క్యాంప్​లోనూ పాల్గొన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్​లో విధులు కూడా నిర్వహించారు. చిన్నప్పటి నుంచి తనకు సైనికుడు కావాలని ఉండేదని పలు సందర్భాల్లో ధోనీ వెల్లడించారు. 'ఆర్మీ సిబ్బందిని చూస్తున్నప్పుడల్లా నేను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానని చిన్నప్పుడే అనుకునేవాడిని' అని ధోనీ తెలిపారు.

Dhoni Jersey No 7 : టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ విషయంలో బీసీసీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ధోనీ జెర్సీ నంబర్ 7ను రిటైర్​ చేస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇకపై ఈ నెంబర్​తో టీమ్​ఇండియాలో మరో జెర్సీ ఉండదు. దీంతో మరే ఇతర భారత క్రికెటర్ ఈ నెంబర్​ జెర్సీని వేసుకునే ఛాన్స్ లేదు. కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ జెర్సీ నెంబర్ 10ని బీసీసీఐ ఇప్పటికే రిటైర్ చేసింది.

ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష

ఫ్రెండ్ బర్త్​డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్​ సస్పెండ్!

Last Updated : Dec 22, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details