తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా స్థానంలో మరో ప్లేయర్​.. ప్రకటించిన బీసీసీఐ.. అతడెవరంటే? - మహమ్మద్​ సిరాజ్​ భారత్​ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్​

India South Africa T20 Series : వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన పేసర్​ బుమ్రా స్థానంలో మరో ప్లేయర్​ను తీసుకుంది బీసీసీఐ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

India South Africa T20 Series
India South Africa T20 Series

By

Published : Sep 30, 2022, 11:06 AM IST

India South Africa T20 Series : ప్లేయర్లు గాయాలపాలవుతుండటం కారణంగా టీమ్​ ఇండియాకు తిప్పులు తప్పడం లేదు. ఇప్పటికే గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వరల్డ్‌ కప్‌నకు దూరమయ్యాడు. గాయం కారణంగా కొద్ది రోజుల పాటు ఆటకు దూరమైన స్టార్​ పేసర్​ బుమ్రా కోలుకుని ఆస్ట్రేలియా సిరీస్​తో జట్టులోకి తిరిగివచ్చాడు. అయితే అతడు మళ్లీ వెన్నునొప్పి కారణంగా ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా సిరీస్​ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారు అనే చర్చ ఇప్పటి వరకు జరిగింది.

బుమ్రా స్థానంలో అవకాశం కోసం మహమ్మద్ షమీతో పాటు మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌ కూడా పోటీ పడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. దీపక్‌ చాహర్‌ కూడా ఇటు బ్యాటింగ్‌తోపాటు, బౌలింగ్‌లోనూ అక్కరకొస్తాడు.. ఆసీస్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలం కాబట్టి పేసర్‌ అయితేనే ఉత్తమం.. అందుకే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ షమీ వైపు మొగ్గు ఛాన్స్‌ అందరు అనుకున్నారు. మహమ్మద్ సిరాజ్‌.. యువ బౌలర్‌ ఉమ్రాన్‌ ఖాన్‌.. అవేశ్‌ ఖాన్‌.. ప్రసిధ్ కృష్ణ.. పేర్లు కూడా వినిపించాయి.

అయితే వీటన్నిటికీ తెరతీస్తూ బీసీసీఐ హైదరాబాద్​ ప్లేయర్ మహమ్మద్​ సిరాజ్​ను బుమ్రాకు రిప్లేస్​మెంట్​గా జట్టులోకి తీసుకుంది. వెన్నుకు గాయమైన బుమ్రా బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. భారత్​-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్​లో భాగంగా రెండో టీ20 మ్యాచ్​ గువాహటి వేదికగా అక్టోబర్ 2న జరగనుంది. మూడో టీ20 ఇందోర్​లో జరుగుతుంది. అయితే బుమ్రా కూడా జట్టులో లేకపోతే టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పేస్‌కు సహకరించే ఆసీస్‌ పిచ్‌లపై బుమ్రా చెలరేగుతాడని ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పేలా లేదు. రాబోయే మెగా టోర్నీ ముందు టీమ్​ ఇండియా ప్లేయర్లు ఇలా గాయాలపాలవుతుండటం అభిమానుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ భారత జట్టు:రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్​ చాహర్, ఉమేశ్​ యాదవ్, శ్రేయస్​ అయ్యర్​, షహ్​బాజ్​ అహ్మద్​, మహమ్మద్​ సిరాజ్​

ఇవీ చదవండి:అట్టహాసంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు.. ఫైనల్లో తెలంగాణ

'సచిన్​ కోసం రెండుసార్లు 500 కి.మీ సైకిల్​ మీద వెళ్లా.. కానీ..'

ABOUT THE AUTHOR

...view details