టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 news)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా(Ind vs pak t20) ఓడిపోయింది. బ్యాట్స్‌మెన్ తడబడటం వల్ల ప్రత్యర్థి ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది కోహ్లీసేన. బ్యాటింగ్‌కు దిగిన పాక్.. ఒక్క వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్(babar azam stats), మహమ్మద్ రిజ్వాన్(mohammad rizwan record) అర్ధసెంచరీలతో మెరిశారు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు రిజ్వాన్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
భారత్‌తో మ్యాచ్.. రిజ్వాన్ చెప్పి మరీ కొట్టాడు!
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 news)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్.. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే రిజ్వాన్ ఎలాంటి షాట్లు ఆడాలో ప్రాక్టీస్ చేశాడు. అదే షాట్లను మ్యాచ్‌లోనూ ఆడి పాక్‌కు గెలుపు అందించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏదైనా గొప్ప పోరులో గెలవాలంటే అంతకుమించిన కసి, పట్టుదల, ప్రణాళిక మనదగ్గర ఉండాలి. అదే చేసి చూపించాడు రిజ్వాన్(mohammad rizwan record). భారత్‌తో మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో.. ముందే ఎలాంటి షాట్లను ఆడాలో ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్ మొదలుకావడానికి ముందు వికెట్ల వెనకాల నిలబడి షాట్లు ఆడాడు. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలో దిగి అదే షాట్లను మ్యాచ్‌లోనూ ఆడాడు. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిజ్వాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆడాడంటూ కితాబిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 20 ఓవర్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూర్తిగా స్వేచ్ఛగా ఆడారు పాకిస్థాన్ ఆటగాళ్లు. ఆ తర్వాత లక్ష్యఛేదలో పాక్ బ్యాటర్లు దుమ్ముదులిపారు. భారత్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచారు. బాబర్ (68), రిజ్వాన్ (79) నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించారు.