తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిథాలీ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ - మహిళా క్రికెటర్​ మిథాలీ రాజ్​

Mithali Raj retirement: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. ప్రపంచకప్​ తర్వాత ఆటకు గుడ్​బై చెప్పబోతున్నట్లు వెల్లడించింది.

mithali raj
మిథాలీ రాజ్​

By

Published : Feb 24, 2022, 12:03 PM IST

Updated : Feb 24, 2022, 12:53 PM IST

Mithali Raj retirement: భారత మహిళల జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్ అటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్​ తర్వాత రిటైర్మెంట్​​ ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

భారత మహిళల జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్​ తర్వాత రిటైర్​మెంట్​ ప్రకటించనున్నట్లు తెలిపింది. టాలెంట్​ కలిగిన ఆటగాళ్లతో జట్టు మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

"నేను ఈ టోర్నమెంట్​ తర్వాత రిటైర్మెంట్​ ప్రకటిస్తాను. ఆ తర్వాత కొత్త టాలెంట్​ కలిగిన ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలంగా తయారవుతుంది."

-మిథాలీ రాజ్​

న్యూజిలాండ్​తో 5 వన్డేల సిరీస్​లో భాగంగా జరిగిన చివరి వన్డే అనంతరం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సిరీస్​లో భారత్​ 4-1 తేడాతో పరాజయం పాలైంది. ఎట్టకేలకు ఐదో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో టీమ్​ఇండియా గెలిచింది. ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు స్మృతి మంధానకు వరించింది.

మిథాలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 222 వన్డేలు ఆడి 51.8 సగటుతో 7,516 పరుగులు సాధించింది. ఇందులో 7 సెంచరీలు, 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 125 నాటౌట్. టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. 89 టీ20 మ్యాచులాడిన ఆమె 37.52 సగటుతో 2,364 పరుగులు సాధించింది. ఇందులో 17 అర్థ శతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​: మిథాలీ రాజ్​@2

Last Updated : Feb 24, 2022, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details