ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్ల్లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్-5లోకి ప్రవేశించింది. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులు చేయడం మిథాలీకి కలిసొచ్చింది. 2019 అక్టోబర్‌లో చివరిసారిగా మిథాలీ తొలి ఐదుగురిలో ఉండేది. ఇంగ్లాండ్‌పై వన్డేతో 22 ఏళ్ల కెరీర్లోకి అడుగుపెట్టిన మిథాలీ.. 27కే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకుంది.
మరో టీమ్ఇండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్ ఆల్‌రౌండర్ల జాబితాలో 97వ స్థానంలో నిలిచింది. ఇక బ్యాటర్ల జాబితాలో 88వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
యువ సంచలనం, టీ20 టాప్ ప్లేయర్ షెఫాలీ వర్మ 120వ ర్యాంకుతో వన్డే కెరీర్‌ను మొదలుపెట్టింది.
భారత్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ ఓపెనర్ టమ్మీ బ్యూమంట్.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. తాజా జాబితాలో 26 రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకుని 791 పాయింట్లకు చేరుకుంది. మరో బ్యాటర్ స్కైవర్ 9వ స్థానం నుంచి 8న స్థానంలో నిలిచింది. ఇక బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ శ్రుబ్సోలే.. మిథాలీ సేనతో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న ఆమె 8వ స్థానానికి పరిమితమైంది. పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంకర్ సోఫీ ఎకిల్‌స్టోన్ పదో స్థానానికి చేరుకుంది.
ఇదీ చదవండి:Team India: దొరికిందమ్మ విరామం.. ఇక చుట్టేస్తాం నగరం