తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పురుషుల దుస్తులే అమ్మాయిలకూ'.. షాకింగ్ విషయాలు! - స్మృతి మంధాన

Vinod Rai BCCI: టీమ్​ఇండియా మహిళల క్రికెట్​ గురించి షాకింగ్​ విషయాలను వెల్లడించాడు బీసీసీఐ పరిపాలన కమిటీ మాజీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌. పురుషుల యూనిఫాం కత్తిరించి అమ్మాయిల కోసం మళ్లీ కుట్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. హోటల్​లోనూ వారికి కావాల్సిన ఆహారం లభించేది కాదని ఇటీవలే తను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు.

vinod rai bcci
women cricket india

By

Published : Apr 19, 2022, 9:56 AM IST

Vinod Rai BCCI: మహిళల క్రికెట్‌పై గతంలో తగినంతగా దృష్టి సారించకపోవడం తనను బాధించిందని బీసీసీఐ పరిపాలన కమిటీ మాజీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపాడు. సుప్రీంకోర్టు నియమించిన పరిపాలన కమిటీ.. 2017 నుంచి 2019 వరకు సుమారు 33 నెలల పాటు బీసీసీఐ వ్యవహారాల్ని పర్యవేక్షించింది. అప్పటి తన పాత్రపై 'నాట్‌ జస్ట్‌ ఎ నైట్‌వాచ్‌మన్‌' పేరుతో వినోద్‌ రాయ్‌ పుస్తకం రాశాడు. అందులో మహిళల క్రికెట్‌పై ఒకప్పుడు చూపిన వివక్ష గురించి వినోద్‌ ప్రస్తావించాడు.

టీమ్​ఇండియా

"మహిళల క్రికెట్‌పై కావాల్సినంత శ్రద్ధ చూపలేదు. 2006లో శరద్‌ పవార్‌ మహిళల క్రికెట్‌ను విలీనం చేయడానికి చొరవ తీసుకునే వరకు అమ్మాయిల ఆటను సరిగా పట్టించుకోలేదు. పురుషుల బట్టల్ని (యూనిఫాం) కత్తిరించి అమ్మాయిల కోసం మళ్లీ కుట్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. ఇక మీదట అలా జరగకూడదని నైకి సంస్థకు ఫోన్‌ చేసి చెప్పా. అమ్మాయిలకు భిన్నమైన డిజైన్‌ ఉండాలని సూచించా. మరింత మెరుగైన శిక్షణ, వసతులు, పరికరాలు, ప్రయాణ వసతులు, మ్యాచ్‌ ఫీజులకు అమ్మాయిలు అర్హులు. 2017 ప్రపంచకప్‌లో హర్మన్‌ 171 ఇన్నింగ్స్‌ ఆడే వరకు మహిళల క్రికెట్‌పై తగినంతగా దృష్టి సారించలేదు. 'సర్‌.. కాలి కండరాలు పట్టేస్తుండటం వల్ల పరుగెత్తలేకపోయా. అందుకే సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నించా' అని నాతో హర్మన్‌ చెప్పింది. హోటల్‌లో వాళ్లకు కావాల్సిన ఆహారం లభించలేదన్నారు. ఉదయం అల్పాహారంగా సమోసాలు తిన్నట్లు వివరించారు" అని రాయ్‌ పేర్కొన్నాడు.

స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్ కౌర్

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details