తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎంసీఏ మ్యూజియంలో అజాజ్​ 10 వికెట్ల బంతి

MCA Pride Of The Place: ఇటీవల టెస్టుల్లో 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు న్యూజిలాండ్​ స్పిన్నర్ అజాజ్​ పటేల్. ఆ తర్వాత అతడి ఉపయోగించిన బంతిని ఎంసీఏ మ్యూజియంలో ఉంచారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే ఎంసీఏ మ్యూజియంలో ' ప్రైడ్ ఆఫ్ ఆనర్' కింద ఆ బంతిని భద్రపరుస్తామని ఎంసీఏ అధ్యక్షుడు విజయ్ పాటిల్ అన్నారు.

Azaz
అజాజ్

By

Published : Dec 17, 2021, 7:30 PM IST

MCA Pride Of The Place: భారత్- న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్​లో ఏకంగా 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఆ తర్వాత తన బంతిని ఎంసీఏ మ్యూజియంకు ఇవ్వడాన్ని ప్రశంసించారు ముంబయి క్రికెట్ అసోసియేషన్​(ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్ పాటిల్​. త్వరలో ఈ బంతిని 'ప్రైడ్​ ఆఫ్ ఆనర్​' కింద భద్రపరుస్తామని అన్నారు. ఎంసీఏ మ్యూజియం.. భావితరాలకు స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"వాంఖడే స్టేడియంలో అజాజ్​ పటేల్ సాధించిన విజయం ఎవరూ ఊహించలేనిది. మన స్టేడియం అజాజ్ సాధించిన ఈ విజయం ఓ జ్ఞాపకంలా మిగులుతుంది. ఆట తర్వాత 10 వికెట్లు తీసిన బంతిని ఇచ్చాడు. దానిని ఎంసీఏ మ్యూజియంలో 'ప్రైడ్​ ఆఫ్ ఆనర్'​ కింద భద్రపరుస్తాం" అని పాటిల్ తెలిపారు.

MCA Historical Legacy: ముంబయి క్రికెట్​కు ఎంతో ఘన చరిత్ర ఉందని, ముంబయి ఆటగాళ్లు సాధించిన విజయాలు మరవలేనివని అన్నారు పాటిల్. 2011 వన్డే ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్ చివరి ఓవర్లో మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్ కొట్టాడని.. అప్పడు బంతి పడిన కుర్చీని కూడా భద్రపరుస్తామని చెప్పారు. ఇలాంటి జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. ముంబయి క్రికెట్​లో జరిగిన ఎన్నో చారిత్రక సంఘటనలను ఒకే చోట పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

2022 అండర్​-17 ఫిఫా వరల్డ్​కప్​నకు ముంబయి ఆతిథ్యమిస్తోందని వెల్లడించారు పాటిల్. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6వరకు ఈ టోర్నీ​ ముంబయి,నేవీ ముంబయి, పుణెలో జరగనుంది.

Ajaz 10 Wickets: భారత్- న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్​లో ఏకంగా 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఓ టెస్టు ఇన్నింగ్స్​లో 10 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అజాజ్ నిలిచాడు. అంతకుముందు జిమ్​ లేకర్​(1956), అనిల్ కుంబ్లే(1999) ఈ ఘనత సాధించారు.

ఇదీ చూడండి:'పేసర్​ అవ్వాలనుకున్నా.. కానీ స్పిన్నర్ అయ్యా'

ABOUT THE AUTHOR

...view details