Team India Transition BCCI: టీమ్ఇండియా టీ20 జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత ఘోర పరాజయం పాలవ్వడం వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రమంగా టీ20 జట్టుకు దూరమవుతారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
'టీ20 జట్టులో సమూల మార్పులు.. కోహ్లీ, రోహిత్‌లకు ఉద్వాసన.. రిటైర్మెంట్ ఇవ్వకున్నా..'
టీమ్ఇండియా టీ20 జట్టులో బీసీసీఐ సమూల మార్పులు చేయనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 మ్యాచుల్లో సీనియర్లు ఆడేందుకు అవకాశం లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. టీ20 జట్టుకు సీనియర్లు క్రమంగా దూరమవుతారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే?
"బీసీసీఐ ఏ ఆటగాడిని రిటైర్మెంట్ ప్రకటించమని ఎప్పుడూ అడగదు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ 2023లో జరగబోయే పలు టీ20 మ్యాచుల్లో చాలా మంది సీనియర్లకు చోటు దక్కదు. వారికి కేవలం వన్డేలు, టెస్ట్ సిరీస్‌లకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. వచ్చే ఏడాది టీ20ల్లో మాత్రం వారిని ఆడించే అవకాశం లేదు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ క్రమంగా జట్టుకు దూరమవుతారు" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
అంతకుముందు, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ స్పందించారు. కొంతమంది సీనియర్లు ఆటకు వీడ్కోలు పలకాలని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. జట్టు బాధ్యతులు స్వీకరిస్తాడని గావస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి ఏడాది కప్ గెలుచుకున్న హార్దిక్.. టీమ్ఇండియా కెప్టెన్‌గా చాలా మంది గుర్తిస్తున్నారని అన్నాడు.