ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న చారిత్రక డేనైట్ టెస్టు తొలి రోజు ఆటలో ఆధిపత్యం వహించింది భారత మహిళల జట్టు. తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 132 పరుగులు సాధించింది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల మొదటి రోడు 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
మెరిసిన మంధాన.. డేనైట్ టెస్టులో భారత్ పైచేయి - స్మృతి మంధాన
ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న చారిత్రక డేనైట్ టెస్టులో గొప్ప ఆటతీరు ప్రదర్శిస్తోంది భారత మహిళల జట్టు. తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడం వల్ల 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభాన్నందించారు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన. గులాబి బంతితో ఆడడం ఇదే తొలిసారి అయినా వీరిద్దరూ గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం నిర్మిస్తున్న తరుణంలో షెఫాలీ (31)ని పెవిలియన్ చేర్చింది మోలినెక్స్. ఆ తర్వాత మంధానతో కలిసి పూనమ్ రౌత్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. గురువారం ఆట ముగిసే సమయానికి మంధాన 80*, పూనమ్ 16* పరుగులతో క్రీజులో ఉన్నారు.