ఇంగ్లాండ్ పర్యటనలో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బ్యాటింగ్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ ఆమె దూసుకెళ్లింది. కెరీర్ అత్యుత్తమ ర్యాంకింగ్‌ను అందుకుంది. టీ20ల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 111 పరుగులు చేసిన అనంతరం ఈ ఘనత సాధించింది. అలానే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి వన్డే మ్యాచ్‌లో 91పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది.
స్మృతి మంధాన జోరు.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ - మంధాన టీ20 ర్యాంకింగ్స్
టీమ్ఇండియా స్టార్ మహిళా క్రికెటర్ మంధాన తాజా టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకుంది.
ఇక భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో గణనీయంగా మెరుగైంది. ఆమె నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా ఒక స్థానం ఎగబాకి 32వ స్థానానికి చేరుకుంది. వికెట్ కీపర్ యస్తికా భాటియా ఎనిమిది స్థానాలు ముందుకు జరిగి 37వ ర్యాంకులో నిలిచింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఆరు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకుకు చేరుకుంది. కాగా, టీ20 బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కూడా 14వ స్థానానికి చేరుకోగా.. బౌలర్లలో రేణుకా సింగ్, స్పిన్నర్ రాధా యాదవ్ 10, 14వ స్థానాలకు చేరుకున్నారు. ఆల్రౌండర్లలో స్నేహా రానా, పూజా వస్త్రాకర్ కలిసి 41వ ర్యాంకుకు చేరుకున్నారు.
ఇదీ చూడండి: అప్పుడు రోహిత్.. ఇప్పుడు రవిబిష్ణోయ్.. సవాల్ విసిరారుగా!