తెలంగాణ

telangana

ETV Bharat / sports

లఖ్​నవూ ప్లేయర్ల వినూత్న వేడుకలు​.. గంభీర్​ వింటేజ్​ పంచ్​! - లఖ్​నవూ సెలబ్రేషన్స్​

LSG CELEBRATIONS: ఈ ఏడాది లీగ్​లోకి కొత్తగా చేరిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ జట్టు గతరాత్రి చెన్నైతో జరిగిన ఘన విజయం సాధించింది. సీఎస్​కే నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. ఆ మ్యాచ్​ విజయం అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్స్​ను మీరూ చూసేయండి.

LSG CELEBRATIONS
LSG CELEBRATIONS

By

Published : Apr 1, 2022, 3:18 PM IST

LSG CELEBRATIONS: ఐపీఎల్‌-2022లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టు బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్​ అనంతరం డ్రెస్సింగ్​ రూంలో లఖ్​నవూ ఆటగాళ్లు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. మెంటర్​ గౌతమ్​ గంభీర్​తో సహా ఆటగాళ్లంతా కలిపి పాటలను పాడుతూ సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. లఖ్​నవూ జట్టు సోషల్​మీడియాలో షేర్​ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

ఇక, మైదానంలోని డగౌట్‌లో కూర్చున్న లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటర్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగానే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ, సహచరులను పంచ్‌ చేస్తూ తనదైన శైలిలో విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గౌతమ్​ గంభీర్​

మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఊతప్ప (50), శివమ్‌ దుబే (49), మొయిన్‌ అలీ (35) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూ నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. లఖ్​నవూ బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) ఎవెన్​ లూయిస్‌(55) పరుగులతో అద్భుతంగా రాణించారు.

ఇదీ చదవండి: చెన్నై చరిత్రలో తొలిసారి అలా!.. 'టీ20ల్లో ధోనీ రికార్డు'

ABOUT THE AUTHOR

...view details