తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకే ఓవర్​లో 6 సిక్సర్లు.. 19 బంతుల్లోనే 83.. టీ10 లీగ్​లో పాండే వీరవిహారం! - ఆరు బంతుల్లో ఆరు సిక్సులు

6 బంతుల్లో 6 సిక్స్‌లు.. ఈ రికార్డు గురించి మాట్లాడితే మనకు గుర్తొచ్చేది టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ చెలరేగిపోయాడు. అతడి తర్వాత పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. టీ 10 చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతడి పేరే కృష్ణ పాండే!

krishna pandey hits 6 sixes in 6 balls
krishna pandey hits 6 sixes in 6 balls

By

Published : Jun 5, 2022, 1:35 PM IST

6 Balls 6 Sixes Krishna Pandey: క్రికెట్​ చరిత్రలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం అంటే అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికీ మరోసారి ఈ రికార్డు రిపీట్​ అయ్యింది. పుదుచ్చేరి వేదికగా జరుగుతున్న టీ 10 లీగ్​లో పేట్రియాట్స్ జట్టు ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. చివరిసారిగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఈ ఫీట్​ను నమోదు చేయగా.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ రికార్డు నమోదైంది.

శనివారం రాయల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పేట్రియాట్స్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో 6వ ఓవర్​ను వేయడానికి బౌలర్​ నితేష్‌ ఠాకూర్‌ వచ్చాడు. ఫ్లిక్ షాట్, హుక్ షాట్ ఇలా అన్ని రకాల షాట్లను ఆడిన కృష్ణ పాండే.. గ్రౌండ్ నలువైపులా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈ మ్యాచ్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి మరీ!.

ఈ మ్యాచ్​లో కేవలం 19 బంతులు మాత్రమే ఆడిన కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. మొత్తంగా 83 పరుగులు చేశాడు. అయినప్పటికీ పేట్రియాట్స్ జట్టు ఈ మ్యాచ్​లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్.. ఇంగ్లండ్ జట్టు​పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్​లో యువరాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. అప్పుడు 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సహా.. మొత్తం 16 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి:అప్పుడు కావాలనే సచిన్​ను గాయపరిచా: అక్తర్

దుండగుల దాడి.. కోమా నుంచి కోలుకున్న యువ క్రికెటర్​

ABOUT THE AUTHOR

...view details