kohli vs west indies players : జులై నెలలో వెళ్లబోయే వెస్టిండీస్ పర్యటనకు సంబంధించి.. టీ20 భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఇక్కడ ఐపీఎల్ ప్రదర్శన వల్ల హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు మొదటిసారి అంతర్జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం. కానీ స్టార్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మాత్రం చోటు దక్కలేదు. వారికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
Rohit vs west indies T20 : 8 నెలల నుంచి ఒక్క సిరీస్‌లోనూ.. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ ముగిసి దాదాపు 8 నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ సారి వరల్డ్ కప్ తర్వాత టీమ్ఇండియా ఆడిన సిరీస్‌లు గమనిస్తే.. భారత జట్టు ఆడిన ఏ టీ20 సిరీస్‌లోనూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ అస్సలు కనిపించలేదని అర్థమవుతోంది.
మొదట్లే క్రికెట్ అభిమానులు అందరూ విశ్రాంతిగానే భావించారు. కానీ ఆ తర్వాత గమనిస్తే.. వీరిని పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది. ఓ సిరీస్ తర్వాత మరో సిరీస్‌కు వీరు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఎందులోనూ పాల్గొనట్లేదు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేసిన జట్టులోనూ.. స్టార్ బ్యాటర్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ లేరు.
వేటు వేయలేదు.. గతంలోనూ ఇలానే.. వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మను.. టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా బీసీసీఐ పేర్కొనలేదు. కానీ హార్దిక్ పాండ్యాను మాత్రం సారథిగా ఎంపిక చేసి వరుసగా మూడు సిరీస్‌ల అతడి సారథ్యంలోనే ఆడించింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. రోహిత్, కోహ్లిలకు వయసు మీద పడింది. కెరీర్ లాస్ట్ స్టేజ్‌కు వచ్చింది. వారి దృష్టి ప్రస్తుతం కేవలం వన్డే ప్రపంచకప్ మీదే ఉందని అర్థమవుతోంది. అందుకే ఆ స్థాయి ప్లేయర్ల మీద వేటు వేయడం ఎలాగో జరగదు. గతంలోనూ కూడా ఇలానే జరిగింది. 2007 టీ20ల నుంచి సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్లు ఎలా తప్పుకున్నారో.. ఇప్పుడు వీళ్లు కూడా అలానే సైలెంట్‌గా వారంత వారే దూరం అయ్యారని చెప్పొచ్చు.