Mayank praises Dravid: టీమ్ఇండియా మాజీ కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై టాపార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ప్రశంసల జల్లు కురిపించారు. ద్రవిడ్ మాజీ ఆటగాడిగా తన అనుభవంతో జట్టుకు బాగా ఉపయోగపడటమే కాకుండా బూస్ట్‌లా పనికొస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వీరు.. నూతన కోచ్ గురించి, ఆయన కోచింగ్ పద్ధతుల గురించి కాసేపు చర్చించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ టీవీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
సౌతాఫ్రికాతో సిరీస్.. ద్రవిడ్ అనుభవం కొండంత అండ! - కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్
Mayank praises Dravid: టీమ్ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు టాపార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వీరు.. నూతన కోచ్ గురించి, ఆయన కోచింగ్ పద్ధతుల గురించి కాసేపు చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా తొలుత రాహుల్ మాట్లాడుతూ.. "ఈసారి మనవెంట ద్రవిడ్ సర్ లాంటి అనుభవజ్ఞుడు ఉండటం బాగా కలిసొస్తుంది. ఇక్కడ ఆయన ఎంతో క్రికెట్ ఆడారు. ఎన్నో పరుగులు సాధించారు. ఇప్పటి వరకు సాగిన ప్రాక్టీస్ సెషన్లలోనే ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా శిక్షణ ఇస్తున్నారు. అలాగే నువ్వు (మయాంక్) ద్రవిడ్ సర్ పర్యవేక్షణలోనూ చాలా క్రికెట్ ఆడావని నాకు తెలుసు. ఇండియా-ఏతో పాటు మరిన్ని మ్యాచ్‌ల్లోనూ ఆయన దగ్గర శిక్షణపొందావు" అని రాహుల్ అన్నాడు.
అనంతరం మయాంక్ మాట్లాడుతూ.. ద్రవిడ్ శిక్షణా పద్ధతులు ఎలా ఉంటాయో వివరించాడు. "నాకైతే వ్యక్తిగతంగా ఆయన అంటే ఎంతో గౌరవం. మన ఆటను మనమే అర్థం చేసుకునేలా చేస్తారు. తన మాటలతో మన ఆలోచనా విధానం, మన ఆటతీరును మార్చేస్తారు. దాంతో మన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. ఏ ఆటగాడికైనా అత్యుత్తమ శిక్షణ అందించాలన్నదే ఆయన లక్ష్యం. ఆ విధంగా మనం ఇక్కడ మెరుగైన శిక్షణ పొందుతున్నాం. దీంతో రాబోయే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం" అని మయాంక్ చెప్పుకొచ్చాడు.