తెలంగాణ

telangana

ETV Bharat / sports

KL Rahul IPL: లఖ్‌నవూ సారథిగా కేఎల్ రాహుల్‌! - లఖ్​నవూ జట్టు కెప్టెన్

KL Rahul IPL: ఐపీఎల్​ మెగావేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ లఖ్​నవూకు కేఎల్​ రాహుల్​ను సారథిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

KL Rahul
కేఎల్ రాహుల్

By

Published : Jan 19, 2022, 7:25 AM IST

KL Rahul IPL: ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. వచ్చేనెలలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లఖ్‌నవూ ఎంపిక చేసుకున్న ముగ్గురిలో రాహుల్‌ ఒకడని తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయ్‌నిస్‌, లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఉండే అవకాశం ఉంది. రాహుల్‌కు రూ.15 కోట్లు, స్టాయ్‌నిస్‌కు రూ.11 కోట్లు, బిష్ణోయ్‌కు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

"లఖ్‌నవూకు రాహుల్‌ సారథ్యం వహిస్తాడు. మిగతా ఇద్దరు ఆటగాళ్ల ఎంపికపై జట్టు నిర్ణయం తీసుకోనుంది" అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. గత రెండు సీజన్‌లలో పంజాబ్‌ కింగ్స్‌కు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పంజాబ్‌కు బిష్ణోయ్‌, దిల్లీ క్యాపిల్స్‌కు స్టాయ్‌నిస్‌ ప్రాతినిధ్యం వహించారు.

అప్పుడే ఆలోచించట్లేదు..

టీమ్‌ఇండియా పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌ కావడం గురించి తాను ఆలోచించట్లేదని వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అవకాశం వస్తే మాత్రం సాధ్యమైనంత మెరుగ్గా జట్టును నడిపిస్తానని చెప్పాడు. "జట్టుకు నాయకత్వం వహించడం అంటే ఏ ఆటగాడికైనా కల నిజం కావడమే. నాకు కూడా అంతే. ప్రస్తుతానికైతే నేను దేని గురించీ ఆలోచించట్లేదు. కెప్టెన్సీ వస్తే మాత్రం భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి నా శక్తి మేర చేయాల్సిందంతా చేస్తా" అని రాహుల్‌ అన్నాడు.

ఇదీ చదవండి:

సఫారీలతో సమరానికి టీమ్​ఇండియా సై .. అందరి కళ్లూ కోహ్లీపైనే

IND VS SA: ఓపెనర్లుగా వారిద్దరు​​.. ఆరో బౌలర్​గా ఆ ప్లేయర్​కు ఛాన్స్​

ABOUT THE AUTHOR

...view details