KL Rahul Australia Series :వన్డే ప్రపంచ కప్‌కు ముందు టీమ్ఇండియా మరో కీలక పోరు కోసం బరిలోకి దిగనుంది. సొంత గడ్డపై జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మొహాలీ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న తొలి వన్డేలో కంగారు జట్టుతో పోటీకి సిద్ధం కానుంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ నలుగురు కొంత రెస్ట్ తర్వాత ఆఖరి వన్డేకు జట్టుతో కలవనున్నారు.
ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీతో అతని స్థానంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు సారథ్యం వహించేందుకు కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పగ్గాలు అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ఆసియా కప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ను ఇచ్చిన రాహుల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచేందుకు ముందుకొస్తున్నాడు. అయితే రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఇదేం తొలిసారి కాదు. అతను ఇదివరకే పలు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న అతని కెప్టెన్సీ రికార్డులను ఓ లుక్కేద్దాం.
KL Rahul Captaincy Record : ఇప్పటివరకు రాహుల్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 11 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. వన్డేల్లో 7 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు అతను నాయకత్వం వహించగా.. అందులో నాలుగింటిలో జట్టు విజయం సాధించింది. గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు చివరగా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.