తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు భారీ షాట్​ ఆడేందుకు ప్రయత్నించా.. కానీ' - టెంప్ట్ అయిన కేఎల్ రాహుల్

KL Rahul big shot: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సెంచరీతో సత్తాచాటాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. అయితే తాను 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్ ఆడేందుకు టెంప్ట్ అయ్యానని తెలిపాడు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నానని వెల్లడించాడు.

KL Rahul latest news, KL Rahul attempt big shot, కేఎల్ రాహుల్ లేటెస్ట్ న్యూస్, కేఎల్ రాహుల్ బిగ్ షాట్
KL Rahul

By

Published : Dec 27, 2021, 5:25 PM IST

KL Rahul big shot: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం 99 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా భారీ షాట్‌ ఆడేందుకు టెంప్ట్‌ అయ్యానని టీమ్‌ఇండియా శతక వీరుడు కేఎల్‌ రాహుల్‌ (122*) అన్నాడు. తర్వాత తన భావోద్వేగాన్ని నియంత్రించుకుని అలాంటి షాట్‌ ఆడటాన్ని విరమించుకున్నానని చెప్పాడు.

"నేను శతకానికి ఒక పరుగు దూరంలో ఉండగా స్పిన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ లేదా భారీషాట్‌ ఆడాలనుకున్నా. అప్పుడు ఫీల్డర్లంతా సర్కిల్‌లోనే ఉండటం వల్ల భారీ షాట్‌ ఆడాదామని టెంప్ట్‌ అయ్యా. కానీ, దాన్ని విరమించుకున్నా. నేను ఈ ఏడాది లార్డ్స్‌లో శతకం బాదినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసిన తీరు నాకే ఆశ్చర్యమేస్తుంది. అయితే, నేను ఆ సింగిల్‌ తీసి సెంచరీ చేయాలని అనుకోలేదు. ఆ ఒక్క బంతిని మాత్రమే అలా భారీ షాట్‌ ఆడాలని అనుకున్నా. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. చివరికి మా జట్టును మంచి స్థితిలో నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది."

-రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్

కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది 90 పరుగుల్లోకి వచ్చాడు రాహుల్. ఆపై బౌండరీ బాది శతకానికి చేరువయ్యాడు. చివరికి సింగిల్‌తోనే టెస్టుల్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున దక్షిణాఫ్రికాలో టెస్టు క్రికెట్‌లో మూడంకెల స్కోర్‌ అందుకున్న రెండో ఓపెనర్‌గా నిలిచాడు. .

ఇవీ చూడండి: ఇవనోవిక్.. దిగ్గజాలనే వణికించిన ఇ'స్మార్ట్' ప్లేయర్!

ABOUT THE AUTHOR

...view details