KL Rahul Asia Cup 2023 : రానున్న ఆసియా కప్‌కు సర్వం సిద్ధమౌతున్న వేళ క్రికెట్ లవర్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది టీమ్ఇండియా. గాయల నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించుకున్న స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో భాగంగా జరగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్ఇండియా ప్రధాన కోచ్ కేఎల్ రాహుల్ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ కోసం ఇండియా టీమ్ శ్రీలంకకు బయలుదేరనున్నది. ఇక కేఎల్ రాహుల్ మరో వారం తర్వాత వెళ్లి జట్టుతో కలువనున్నాడు.
Asia Cup 2023 Schedule :ఆసియా కప్‌లో భారత్.. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో, అదే నెల 4న నేపాల్‌తో తలపడనుంది. ఇక ఈ సారి ఆసియా కప్‌నకు పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఆడుతుండగా... గ్రూప్ బిలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
KL Rahul Injury : ఇక గాయం కారణంగా టీమ్ఇండియాకు కొంత కాలం పాటు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఆసియా కప్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కోటాలో సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌ను ఈ జట్టు కోసం ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్‌తో పాటు అంతకుముందు సిరీస్‌లలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలొచ్చాయి. వాటిపై గతంలో రాహుల్ స్పందించారు కూడా. కానీ ఆ తర్వాత గాయం కారణంగా అనూహ్యంగా ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగాడు.