భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోను పీటర్సన్.. సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమని పీటర్సన్ తెలిపారు. మోదీని కలవడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నట్లు పీటర్సన్ ట్వీట్ చేశారు. అయితే దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కు పీటర్సన్ హాజరయ్యారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా పీటర్సన్ కలిశారు.
మోదీ పుట్టినరోజున భారత్‌కు చీతాలు తీసుకురావడం సో గ్రేట్!: ఇంగ్లాండ్ క్రికెటర్ - కెవిన్ పీటర్సన్ మోదీ ఫొటోల
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పీటర్సన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమని తెలిపారు.
పీటర్సన్ వన్యప్రాణులను రక్షించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఖడ్గమృగాలను రక్షించేందుకు జరుగుతున్న ఆఫ్రికాలో ఒక ప్రాజెక్ట్‌లో ఆయన పని చేస్తున్నారు. పీటర్సన్ ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 47.29 సగటుతో 8181 పరుగులు చేశాడు. వన్డేల్లో 4440 పరుగులు సాధించగా.. టీ20ల్లో 1176 పరుగులు కొట్టాడు. కాగా, ఐపీఎల్‌లో 36 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 1001 పరుగులు సాధించాడు.
ఇకపోతే, దేశంలో అంతరించిపోతున్న చిరుతల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరి 18న 12 చిరుత పులులను భారత్‌కు తీసుకొచ్చింది. వీటిలో 7 మగ చిరుతలు, 5 ఆడ చిరుతలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి 18న ఇవి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌కు చేరుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా 8 చిరుత పులులను నమీబీయా నుంచి తెప్పించి ఇదే పార్క్‌లోకి విడిచిపెట్టారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. దీంతో 71 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చిరుతలు దేశంలోకి ప్రవేశించాయి. చిరుతల జాతిని పెంచేందుకు పలు దశల్లో వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది భారత ప్రభుత్వం.