పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022లో కరాచీ కింగ్స్ వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఇస్లామాబాద్ యూనైటెడ్తో ఫిబ్రవరి 14న జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవలేదు. ప్రపంచ స్థాయిలోనే అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడైన బాబర్ కెప్టెన్‌గా ఉన్న జట్టు ఇలా వరుస ఓటమిపాలవ్వడం క్రికెట్ ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కెప్టెన్‌గా బాబర్ అజామ్.. వరుసగా ఏడు ఓటములు - karachi kings continue their winless streak in psl 2022
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022లో కరాచీ కింగ్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. బాబర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ టీం.. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
తాజా ఓటమితో కరాచీ కింగ్స్ లీగ్ దశలోనే వైదొలగనుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఇస్లామాబాద్ యూనిటైడ్ మెుదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లుకు గానూ191 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ (26 బంతుల్లో 34 పరుగులు),ఆజామ్ ఖాన్(14 బంతుల్లో 22 పరుగులు), అసిఫ్ అలీ(11 బంతుల్లో 28) రాణించారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌కు మరోమారు ఓటమి తప్పలేదు.
ఇదీ చదవండి:వీరిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు!