తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత క్రికెట్‌కు వివాదాలు అంత మంచిది కాదు'

Kapil Dev On Kohli Captaincy: వివాదాలు భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు క్రికెట్ దిగ్గజ కపిల్ దేవ్​. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు ఇలా వాదులాడుకుంటే ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందని అన్నారు.

Kapil dev on kohli captaincy
కపిల్ దేవ్

By

Published : Dec 16, 2021, 9:15 PM IST

Kapil Dev On Kohli Captaincy: టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యల వివాదంపై మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్పందించారు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల కోహ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు బీసీసీఐతో కోహ్లీకి విభేదాలున్నాయేమో అనే అనుమానాలకు తావిస్తాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా లాంటి కీలక విదేశీ పర్యటనలకు ముందు ఇలా వాదులాడుకుంటే ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తుందన్నారు.

Kapil Dev Slams Virat Kohli: 'ఇలాంటి సమయాల్లో ఎవరినీ వేలెత్తి చూపటం సరికాదు. బీసీసీఐ అధ్యక్ష పదవి ఎంత గొప్పదో.. టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా అంతే గొప్ప విషయం. అది గంగూలీ అయినా కోహ్లీ అయినా.. బహిరంగంగా పరస్పరం చెడుగా మాట్లాడుకోవడం.. మంచి పద్ధతి కాదు. త్వరలోనే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వివాదాలకు చెక్ పెట్టి.. క్రికెట్‌పై దృష్టి సారించాలి' అని కపిల్ దేవ్‌ సూచించారు. కోహ్లీ సారథ్యంలోని భారత బృందం గురువారం దక్షిణాఫ్రికా బయలుదేరింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 26న సెంచూరియన్‌ వేదికగా ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details