తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్ 50 సెంచరీల రికార్డు బాబర్ బ్రేక్ చేస్తాడు!'- కమ్రాన్ అక్మల్ - Shubman Gill ODI Centuries

Kamran Akmal On Virat Kohli Centuries : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీల మార్క్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే రికార్డును బ్రేక్ చేసే సత్తా.. బాబర్ అజామ్​కు ఉందంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Kamran Akmal On Virat Kohli Centuries
Kamran Akmal On Virat Kohli Centuries

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 3:45 PM IST

Updated : Nov 17, 2023, 3:55 PM IST

Kamran Akmal On Virat Kohli Centuries :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 50 శతకాలు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు రీసెంట్​గా వరల్డ్​కప్ సెమీస్​లో న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును.. విరాట్ బద్దలుకొట్టి ఔరా అనిపించాడు. దీంతో అతడిపై ప్రసంశల వర్షం కురిసింది. అయితే ఈ రికార్డును బద్దలుకొట్టే ఆటగాడు తమ జట్టులో ఉన్నాడంటూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కమ్రాన్ అక్మల్ రీసెంట్​గా పాకిస్థాన్ మీడియా ఛానెల్​ డిబెట్​లో పాల్గొన్నాడు. ఈ డిబెట్​లో విరాట్ కోహ్లీ వన్డే సెంచరీల ప్రస్తావన రాగా.. అక్మల్ ఈ విషయంపై మాట్లాడాడు. ఏ జట్టులోనైనా టాప్ 3 బ్యాటర్లు ఈ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అన్నాడు. "50 సెంచరీల రికార్డును టాపార్డర్ బ్యాటర్లు మాత్రమే బ్రేక్ చేయగలరు. మిడిలార్డర్ బ్యాటర్లు ఈ ఘనత అందుకోలేరు. అయితే మా జట్టులో బాబర్ ఆజామ్​కు ఈ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది. వాళ్ల జట్టు(టీమ్ఇండియా)లో శుభ్​మన్ గిల్​కు కూడా ఛాన్స్​ ఉంది" అని అక్మల్ అన్నాడు.

Babar Azam ODI Stats :పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్.. ఇప్పటివరకు 117 వన్డే మ్యాచ్​లు ఆడాడు. 56.72 సగటున 5729 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం బాబర్ వయసు 29 ఏళ్లు. ఈ లెక్కన బాబర్.. విరాట్ సెంచరీలు అధిగమించాలంటే మరో 32 శతకాలు బాదాలి.

Shubman Gill ODI Stats : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్.. ఈ ఏడాది అద్భుత ఫామ్​తో దూసుకెళ్తున్నాడు. అతడి కెరీర్​లో ఇప్పటివరకు 43 మ్యాచ్​లు ఆడిన గిల్.. 2267 పరుగులు చేశాడు. అందులో 6 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. పట్టుమని 50 వన్డేలు ఆడకముందే గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేయడం విశేషం.

విరాట్ @ 50 సెంచరీలు - ఏ జట్టుపై ఎన్నంటే?

చరిత్ర తిరగరాసిన 'విరాట్' - 50వ సెంచరీతో సచిన్ రికార్డ్​ బ్రేక్

Last Updated : Nov 17, 2023, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details