తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ కంటతడి- కోట్లాదిమంది హృదయాలు ముక్కలైన వేళ..

2019 వన్డే వరల్డ్​ కప్​ సెమీఫైనల్​లో భారత్​ నిష్క్రమించి నేటికి రెండేళ్లు. వన్డేల్లో అదే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్​. కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలు పగిలిన రోజు కూడా అదే!

By

Published : Jul 10, 2021, 1:40 PM IST

Updated : Jul 10, 2021, 2:24 PM IST

MS Dhoni run-out in 2019 workd cup
ధోనీ కన్నీళ్లు పెట్టుకుంది ఇదే రోజు

ఆ అవుట్​తో ధోనీ కన్నీళ్లు పెట్టుకుంది ఇదే రోజు. మహీ రనౌట్​తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలు ముక్కలైంది ఈరోజే. 2019 వన్డే వరల్డ్​ కప్​ సెమీఫైనల్​ నుంచి కోహ్లీ సేన వెనుదిరిగి నేటికి రెండేళ్లు. ప్రపంచకప్​లో అప్పటివరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీమ్​ఇండియా.. అనూహ్యంగా నిష్క్రమించింది. ఎన్నేళ్లు గడిచినా ఆ దృశ్యాలు భారత క్రికెట్​ ప్రేమికుల్లో.. ఓ గుర్తుచేసుకోకూడని జ్ఞాపకంగా మిగిలిపోతుంది!

మాంచెస్టర్​ వేదికగా జులై 9న ప్రారంభమైన మ్యాచ్​ వర్షం కారణంగా రిజర్వ్​డే(జులై 10)కి వెళ్లింది. న్యూజిలాండ్​ ప్రత్యర్థి జట్టు మొదట బ్యాటింగ్​ ఎంచుకుని 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది. ఆ తర్వాత మైదానంలో దిగిన కోహ్లీ సేన మొదట్లోనే తప్పటడుగులు వేసింది. 24 రన్స్​కే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇండియన్ బ్యాటింగ్​ టాప్ ఆర్డర్​ కుప్పకూలగా.. మైదానంలోని ప్రేక్షకుల ముఖాల్లో నిరాశ నెలకొంది.

ధోని రనౌట్..

ఆ తర్వాత క్రీజ్​లోకి వచ్చిన ధోనీ, జడేజాలు విజయంపై ఆశలు రేకెత్తించారు. జడేజా భారీ షాట్లతో అర్థ సెంచరీ పూర్తిచేసుకోగా.. ధోనీ అండతో అతడు విజయతీరాలకు చేరుస్తాడని అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే విలియమ్స్​న్​కు క్యాచ్ ఇచ్చి జడేజా వెనుదిరిగాడు. అప్పటికీ ఏదో ఆశ. ధోనీ క్రీజులో ఉన్నంత సేపు విజయంపై ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ మార్టిన్​ గుప్టిల్​ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. గుప్టిల్​ విసిరిన బంతితో మహీ రనౌట్​గా వెనుదిరిగాడు. ఆ అవుట్​తో ప్రేక్షకుల గుండెలు బద్దలయ్యాయి. ధోనీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు, డ్రెస్సింగ్​ రూంలో రోహిత్​ శర్మ భావోద్వేగం.. ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2019 వన్డే వరల్డ్​ కప్​ నుంచి భారత్​ నిష్క్రించింది. ధోనీకి అదే చివరి మ్యాచ్​ అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ మ్యాచ్​ జరిగిన ఏడాదికి ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించాడు.

ఇవీ చదవండి:MS Dhoni: 'కూల్'​గా మాయ చేసిన మహేంద్రుడు!

Indw vs Engw t20: ఈ అద్భుత క్యాచ్​ చూశారా?

IND vs SL: లంకపై పరుగుల పంట- భారత్​ ఆధిపత్యం

Last Updated : Jul 10, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details