తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2022, 10:08 AM IST

ETV Bharat / sports

'టీమ్ఇండియా గెలుపుతో ఆసీస్​ ఆటగాళ్ల అహం దెబ్బతింది'

Buchanan about Team India: ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ఇండియా వరుసగా రెండు టెస్టు సిరీస్​లు గెలవడం కంగారూ ఆటగాళ్లలో భయం కలిగించిందని తెలిపాడు ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుచానన్. ఈ క్రమంలోనే వారు ఇప్పుడు బాగా ఆడాల్సిన సమయం వచ్చిందని తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో చెప్పాడు.

John Buchanan about Team India, IND vs AUS, జాన్ బుచానన్ టీమ్ఇండియా, భారత్-ఆస్ట్రేలియా టెస్టు
AUS vs IND Test

Buchanan about Team India: టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందడం ద్వారా కంగారూ ఆటగాళ్ల అహం దెబ్బతిందని అన్నాడు ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుచానన్. అలాగే జట్టులో తమ స్థానాలు కోల్పోతామనే భయం ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలోనూ కలిగిందని తెలిపాడు. ఈ క్రమంలోనే వారు ఇప్పుడు బాగా ఆడాల్సిన సమయం వచ్చిందని తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ విజేతగా నిలిచిందని, అందుకు ప్రస్తుత కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ విశేషంగా కృషి చేశాడన్నాడు.

"లాంగర్‌ కష్ట సమయాల్లో ఆసీస్‌కు అండగా ఉన్నాడు. ఏ జట్టునైనా తిరిగి విజయపథంలో నడిపించడానికి సమయం పడుతుంది. ఇక గత నవంబర్‌లో ఆసీస్‌ ప్రపంచకప్‌ గెలిచాక అతడితో మాట్లాడాను. ఆ సమయంలో లాంగర్‌.. పొట్టి కప్ గెలవడం కన్నా.. ఆ మెగా ఈవెంట్‌కు జట్టును ఎలా తీర్చిదిద్దింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించాననే విషయాలు చెప్పడానికి ఆసక్తి కనబరిచాడు. అతడికి మాజీ సారథి టిమ్‌ పైన్‌ కూడా సహకరించాడు" అని బుచానన్‌ తెలిపాడు.

కాగా, ఆసీస్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్​తో యాషెస్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు టెస్టులు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న ఆ జట్టు నాలుగో టెస్టును డ్రాగా ముగించింది. ఐదో టెస్టు మ్యాచ్‌ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి: ఆ మైదానం పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది: బుమ్రా

ABOUT THE AUTHOR

...view details