Joe Root Record: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానానికి చేరుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన రూట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ ఏడాదిలో రూట్ 1,708 టెస్టు పరుగులు సాధించాడు.
పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ 1,788 పరుగులతో(2006) ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన జాబితాలో టాప్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో వెస్టిండీస్ పరుగుల వీరుడు వివ్ రిచర్డ్స్ 1,710 పరుగులు(1976) కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఉన్న రూట్ ఇంకో మూడు రన్స్ చేసుంటే.. రిచర్డ్స్‌ను అధిగమించేవాడు.
కాగా, మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది ఇంగ్లాండ్. ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ నాలుగు ఓవర్లు వేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ 68 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను రిటైన్ చేసుకుంది.