jamesanderson becomes most successful pacer in international cricket: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో జేమ్స్ ఆండర్సన్ ఓ సక్సెస్ఫుల్ పేస్ బౌలర్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికాలోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు.48 బంతులకు గాను 16 పరుగులు చేసిన సైమన్ హార్మర్‌ను ఓడించి ఆండర్శన్ ఈ విజయాన్ని సాధించారు.ఆండర్శన్ అత్యద్భుత బౌలింగ్ స్కిల్స్‌కు హార్మర్ స్టంప్స్ పైనున్న బైల్ సైతం ఎగిరిపోయింది. ఆ విజయాన్ని కళ్లారా చూసిన ప్రేక్షకులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.ఇదివరకే 949 వికెట్లతో సక్సెస్ఫుల్ పేస్ బౌలర్‌గా రికార్డుకెక్కిన గ్లెన్ మెక్ గ్రాత్ రికార్డ్‌ను ఆండర్శన్ తిరగరాశారు. 951 వికెట్లతో గ్లెన్ స్థానాన్ని జేమ్స్ కైవసం చేసుకున్నారు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగవ బౌలర్‌గా ఆయన నిలబడ్డారు. 1347 వికెట్లతో మొదటిస్థానంలో శ్రీలంకకు చెందిన స్పిన్ మాంత్రికుడు ముత్తయ్యా మురలీధరన్ నిలవగా, 1001 వికెట్లతో రెండవ స్థానంలో స్వర్గీయ స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నారు. 956 వికెట్లతో మూడో స్థానంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉన్నారు.
మూడు రోజులు సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఏస్ బౌలర్ బెన్ స్టోక్స్, పేస్‌మేకర్ జేమ్స్ ఆండర్సన్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా పై ఒక ఇన్నింగ్ 85 పరుగులతో భారీ విజయాన్ని సాధించారు.