Babar azam form: 'నేను ప్రతిసారీ భారీగా పరుగులు సాధించాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా' అని పాకిస్థాన్ జట్టు సారథి బాబర్ ఆజామ్ అన్నాడు. తనను విమర్శించిన వారిపై స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశాడు. టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ జట్టు నవంబరు 26(శుక్రవారం) ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది(Pakisthan Bangladesh test series). అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన బాబర్.. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచుల్లో కలిపి కేవలం(7,1,19) మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు.. అతడి ఆటతీరును ట్రోల్చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ట్రోలర్స్‌కు దీటుగా సమాధానమిచ్చిన పాక్ సారథి - babar azam form
Pakisthan Bangladesh test series: తన ఆటతీరుపై విమర్శించినవారికి గట్టి సమాధానమిచ్చాడు పాక్ సారథి బాబర్ ఆజామ్. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో తమ జట్టు బాగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
"నేను ప్రతిసారీ భారీగా పరుగులు చేయాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా. టీ20 సిరీస్‌లో తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం నా దృష్టి టెస్ట్ సిరీస్‌పైనే ఉంది. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది. కొంత కాలం నుంచి మేం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాం. వెంటనే టెస్ట్ ఫార్మాట్‌కు సిద్ధమవ్వడం సవాల్ లాంటిది. టీ20 సిరీస్ తర్వాత పూర్తిస్థాయిలో టెస్ట్ మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే సమయం దొరకలేదు. అయినా మా ఆటగాళ్లలో చాలా మందికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. బాగానే రాణిస్తాం." అని బాబర్ అన్నాడు.
ఇదీ చూడండి: భారత్-పాక్ మ్యాచ్‌కు రికార్డ్ 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే