Ishan Kishan Double Hundred : అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇషాన్ కిషన్ (210) సంచలనం సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం బాదాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (138 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును ఇషాన్ అధిగమించాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఇషాన్‌ను అభినందనలతో ముంచెత్తింది. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిసింది.
- "ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్. టీమ్‌ఇండియా నుంచి మిగతా ప్రపంచం కోరుకొనే విధానం ఇలాంటిదే" - వీరేంద్ర సెహ్వాగ్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
- "వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. అత్యంత వేగవంతమైన ద్విశతకం ఇదే.. కంగ్రాట్స్" - జాన్స్, క్రికెట్ విశ్లేషకుడు
- "ప్రతి ఒక్కరూ తన రికార్డు గురించి మాట్లాడుకొనేలా చేశాడు. అద్భుతమైన రికార్డు సెట్టర్" - బీసీసీఐ
- "ఈతరం టీమ్‌ఇండియా క్రికెట్‌లో ఇలాంటి ఆటే ఆడాలి" - మైకెల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- "అవకాశాల గురించి మాట్లాడటమే కాదు.. సద్వినియోగం చేసుకోవడం అద్భుతం. ఇషాన్ సూపర్‌గా ఆడావు" - వసీం జాఫర్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
- "రికార్డ్స్.. నంబర్స్.. ఎంటర్‌టైన్‌మెంట్.. వీటన్నింటి కలయికతో వచ్చిన ప్రదర్శన శనివారం ప్రత్యేకంగా నిలిచేలా చేసింది" - ముంబయి ఫ్రాంచైజీ
- "డైనమైట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్. వేగవంతమైన సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్‌కు అభినందనలు" - లసిత్ మలింగ, మాజీ క్రికెటర్
- "విధ్వంసం సృష్టించావు ఇషాన్ కిషన్. ఇలానే ఆడు పాకెట్ డైనమో" - వినయ్ కుమార్, మాజీ క్రికెటర్
- "ఇండియా 'కి - షాన్'.. అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేరిపోయావు" - కోల్‌కతా ఫ్రాంచైజీ