తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ.. టీమ్​ఇండియా అత్యుత్తమ టెస్టు కెప్టెన్' - ఇర్ఫాన్​ పఠాన్ వార్తలు

Irfan Pathan Virat Kohli: టీమ్​ఇండియాకు విరాట్​ కోహ్లీనే అత్యుత్తమ టెస్టు కెప్టెన్​ అని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్ అన్నాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్​లో సారథిగా కోహ్లీ 59.09 విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు.

irfan pathan virat kohli
'కోహ్లీనే భారత్​కు అత్యుత్తమ టెస్ట్​ కెప్టెన్'

By

Published : Dec 6, 2021, 5:42 PM IST

Irfan Pathan Virat Kohli: కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్. ఇప్పటివరకు భారత్​కు ప్రాతినిధ్యం వహించిన టెస్టు కెప్టెన్లలో కోహ్లీనే అత్యత్తమం అని పేర్కొన్నాడు. రెండో టెస్టులో న్యూజిలాండ్​పై టీమ్​ఇండియా ఘన విజయం సాధించి 1-0తో సిరీస్​ కైవసం చేసుకున్న నేపథ్యంలో ట్వీట్​ చేశాడు.

"నేను ఇదివరకు చెప్పినట్టుగా విరాట్​ కోహ్లీ టీమ్​ఇండియాకు దక్కిన అత్యుత్తమ టెస్టు కెప్టెన్. గెలుపు శాతం 59.09తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండవ స్థానం 45 శాతంగా ఉంది."

-ఇర్ఫాన్​ పఠాన్ ట్వీట్​

కోహ్లీ రికార్డు..

న్యూజిలాండ్​పై సిరీస్​ విజయంతో కోహ్లీ అరుదైన రికార్డు​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్​లకు సంబంధించి ప్రతి ఫార్మాట్​లో జట్టుకు 50 విజయాలు అందించిన తొలి ఆటగాడిగా ఘనత పొందాడు. దీనిపై బీసీసీఐ కోహ్లీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేసింది.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది.

సోమవారం ఉదయం జయంత్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్‌ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోలస్ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్. కాగా, టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం.

ఇదీ చూడండి :డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details