IRE VS IND 2023 : మరో రెండు రోజుల్లో(ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ షురూ అవ్వనుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల ముందు.. ఈ పొట్టి ఫార్మాట్‌ను టీమ్ఇండియా తన ప్రయోగాలకు వినియోగించనుంది. ఈ సిరీస్ ద్వారా కొందరి ప్లేయర్ల ఫిట్నెస్ను కూడా పరీక్షించనుంది. దాదాపు ఏడాది తర్వాత గ్రౌండ్లోకి అడగపెట్టనున్న బుమ్రాకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడి ఫిట్నెస్ను నిరూపించుకోవడానికి ఇది సరైన వేదిక. నాలుగు ఓవర్ల కోటా అయినా.. బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకొనేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఈ సిరీస్‌లో సత్తా చాటితే.. ఆసియా కప్ సహా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్‌లు ఉంటాయి. ఇక వెస్టిండీస్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన సంజూ శాంసన్‌కు కూడా ఈ సిరీస్‌లో బాగా రాణిస్తే.. భవిష్యత్త్ చోటు ఉపయోగం ఉంటుంది.
తక్కువ అంచనా వేయలేం.. 2018 నుంచి టీమ్ఇండియాకు ఐర్లాంట్తో ఇది మూడో పర్యటన. మొదటిసారి 2018లో కోహ్లీ నాయకత్వంలో రెండు టీ20ల్లో ఆడి భారత జట్టే విజయం సాధించింది. ఆ తర్వాత 2022లో(ireland vs india 2022 highlights) హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో రెండు టీ20ల బరిలోకి దిగింది. ఈ సిరీస్‌లోనూ గెలిచింది. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. అసలు మొట్టమొదటిసారి 2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. అక్కడ కూడా భారత్‌దే విజయం. అయితే, ఐర్లాండ్ ఓడిపోయినంత మాత్రాన తక్కవ అంచనా వేయలేం. ఎందుకంటే టీ20ల్లో టీమ్ఇండియాపైనే 221/5 భారీ స్కోరు ఆ జట్టు సాధించింది.
మరికొన్ని విశేషాలు..
కుల్దీప్ బౌలింగ్‌తో.. మొదటి సారి 2018లో ఐర్లాండ్‌తో సిరీస్ ఆడినప్పుడు రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్ (74) రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరి దెబ్బకు ఈ మొదటి మ్యాచ్‌లో భారత్ 208/5 భారీ స్కోరే చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు.. ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 132/9 స్కోరుకే ఔట్ చేశారు. బౌలర్లలో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ (4/21).. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎగరేసుకుపోయాడు. చాహల్ (3/38), బుమ్రా (2/19) వికెట్లు తీశారు.