టెస్టు క్రికెట్లో భాగమవ్వడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం మరింత మెరుగైందని అంటున్నాడు టీమ్ఇండియా, ఆర్సీబీ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై ఆడడం వల్ల తనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని తెలిపాడు.
"టెస్టు క్రికెట్లో రాణించడం.. ఏ క్రికెటర్‌కైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. టీమ్ఇండియాలో భాగమై.. క్రికెట్లో అత్యుత్తమ స్థాయి ఫార్మాట్‌ను ఆడడం వ్యక్తిగతంగా నాకు చాలా బాగుంది. ప్రతి క్రికెటర్ కనే కల ఆ ఫార్మాట్లో రాణించడం.. అది నా విషయంలో నెరవేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లపై గెలవడం వల్ల నాలోని ఆత్మవిశ్వాసం పెంపొందింది. ఇదే విశ్వాసంతో నేను భవిష్యత్‌లోనూ రాణించగలనని భావిస్తున్నా".