IPL 2023 Play offs : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగిసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టంతా ప్లే ఆఫ్స్ మ్యాచుల పైనే ఉంది. గుజరాత్, చెన్నై, లఖ్‌నవూ, ముంబయి టీమ్స్ ప్లే ఆఫ్స్‌లో తలపడనున్నాయి. వీటిలో ఏ జట్టు గెలిచి టోర్నీలో ముందుకెళ్తుందా అని ఫ్యాన్స్ తెగ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్లే ఆఫ్స్‌లో భాగంగా ఫస్ట్ క్వాలిఫయర్( IPL 2023 Qualifier 1) మ్యాచ్ మరి కాసేపటల్లో జరగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్(GT vs CSK) తలపడనున్నాయి. ఈ ఇరు జట్లు.. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలాగే ఓడిన జట్టుకు మరో ఛాన్స్ కూడా ఉంటుంది.
IPL 2023 Playoffs : వర్షం కారణంగా రద్దైతే.. పరిస్థితి ఏంటి? - వర్షంతో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు రద్దైతే
IPL 2023 Play offs : ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమరానికి రంగం సిద్ధమైంది. అయితే.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లు రద్దైతే పరిస్థితి ఏంటి ? విజేతను ఎలా ప్రకటిస్తారు? ఆ వివరాలు..
IPL 2023 Playoffs : వర్షం కారణంగా రద్దైతే.. పరిస్థితి ఏంటి?
అయితే.. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు వర్షం లేదా ఇతర కారణాలతో రద్దైత పరిస్థితి ఏంటి? ప్రత్యామ్నయం ఏంటి? విజేతను ఎలా ప్రకటిస్తారు? వంటి సందేహాలు క్రికెట్ అభిమానులకు కలుగుతుంటుంది. అయితే వీటికి సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఫలితాన్ని ఎలా ప్రకటించాలనే.. నిబంధనలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి.
- చెన్నైలో జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌కు పెద్దగా వర్షం ముప్పు లేదని తెలుస్తోంది. ఎందుకంటే 'ఆక్యూవెదర్' రిపోర్టు ప్రకారం.. కేవలం 2 శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉందట. కాబట్టి సేఫ్.
- ఒక వేళ వర్షం కారణంగా తొలి క్వాలిఫయర్ , ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ , ఫైనల్ మ్యాచ్‌లు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. విజేతను సూపర్ ఓవర్ ద్వారా ప్రకటిస్తారు.
- ఒకవేళ సూపర్ ఓవర్‌కు కూడా వాతావరణ పరిస్థితులు సహకరించకపోతే.. లీగ్ స్టేజ్‌లో ఆయా జట్ల స్థానాల ఆధారంగా మ్యాచ్ రిజల్ట్‌ను తేలుస్తారు. అయితే ఈ నిబంధన తొలి క్వాలిఫయర్ , ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వీటిన్నింటికీ రిజర్వ్ డే లేదు.
- కాబట్టి ఈ నిబంధనలు ఆధారంగా చూస్తే.. వర్షం కారణంగా ఫస్ట్ క్వాలిఫయర్ రద్దైతే.. గుజరాత్ జట్టుకే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అదే అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉంది.
- ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇలాంటి పరిస్థితిలో ముంబయి ఇండియన్స్ కన్నా.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న లఖ్‌నవూకే టోర్నీలో ముందుకెళ్లే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి.
- ఇకపోతే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్‌డే కూడా ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. టోర్నీ విజేతను ప్రకటించడానికి దారులు ఉన్నాయి.
ఇదీ చూడండి:ధోనీని ద్వేషించాలంటే.. హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..