రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs SRH) ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రీజులో ఉండగా వైడ్ యార్కర్లు వేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar News). బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ పలు వ్యాఖ్యలు చేశాడు.
"నా చేయి బాగా తిరిగింది. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వైడ్ యార్కర్లు వేసేందురు ప్రయత్నించా. తొలుత స్టంప్స్ దిశగా యార్కర్ వేసి ఆరు పరుగులు సమర్పించుకున్నా. అందుకే వైడ్ యార్కర్లు వేయడమే సరైన నిర్ణయం అని భావించా. దుబాయ్‌లోని మూడు మైదానాల్లో మేం పెద్దగా స్కోరు నమోదు చేయలేదు. కానీ, నిన్నటి మ్యాచ్‌లో 10 నుంచి 15 పరుగులు తక్కువే చేశామని అనిపించింది."
-భువనేశ్వర్ కుమార్, బౌలర్.