తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెవాతియా అద్భుత క్యాచ్​.. పరాగ్​ చిత్రమైన బంతి - రియాన్ పరాగ్ బౌలింగ్

పంజాబ్​, రాజస్థాన్​ మధ్య జరిగిన మ్యాచ్​లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఇందులో రాహుల్​ తెవాతియా క్యాచ్​.. ఆ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచిందనే చెప్పాలి. మరో యువ క్రికెటర్​ రియాన్ పరాగ్ ఓ చిత్రమైన బంతితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ​

tewatia, parag, avesh khan
తెవాతియా, పరాగ్, అవేశ్​ ఖాన్

By

Published : Apr 13, 2021, 9:15 AM IST

ముంబయి వేదికగా సోమవారం జరిగిన పంజాబ్​-రాజస్థాన్​ మ్యాచ్​లో రాహుల్​ సేన 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పలు ఆసక్తికర అంశాలు జరిగాయి. రాహుల్​ తెవాతియా ఓ అద్భుతమైన క్యాచ్​ను అందుకోగా.. రియాన్​ పరాగ్​ ఓ విచిత్రమైన బంతిని విసిరాడు. అవేంటో మీరు చూడండి.

తెవాతియా అద్భుతమైన క్యాచ్​..

రాహుల్ తెవాతియా

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ సెంచరీని అడ్డుకుంటూ రాహుల్‌ తెవాతియా పట్టిన క్యాచ్‌ అద్భుతం. కేఎల్‌ జోరు చూస్తే కచ్చితంగా శతకం చేసేలాగే కనిపించాడు. కానీ తెవాతియా అతడి ఆశలకు గండి కొట్టాడు. సకారియా వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ రెండో బంతికి మిడ్‌ వికెట్‌ మీదగా భారీ షాట్‌ ఆడాడు కేఎల్‌. చూస్తే కచ్చితంగా సిక్స్‌ అనిపించిందా షాట్‌. కానీ బౌండరీ లైన్‌ దగ్గర బంతిని గాల్లోనే అందుకున్న తెవాతియా ఆ ఊపులో లైన్‌ దాటేశాడు. కానీ దానికి ముందే బంతిని మైదానంలోకి విసిరిన అతడు మళ్లీ వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. గత సీజన్లోనూ తెవాతియా ఇలాంటి కొన్ని మెరుపు క్యాచ్‌లు పట్టాడు.

ఇదీ చదవండి:గోల్ఫ్​లో మత్సుయామ సరికొత్త రికార్డు

పరాగ్‌.. ఓ చిత్రమైన బంతి..

రియాన్ పరాగ్

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ దూకుడు మీదున్నప్పుడు బౌలింగ్‌కు వచ్చిన లెగ్‌స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌.. ఓ చిత్రమైన బంతి వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొమ్మిదో ఓవర్‌ మూడో బంతిని అతడు చేతిని పూర్తిగా తిప్పకుండా బాగా అడ్డంగా ఉంచుతూ విసిరాడు. అదే క్రమంలో అతడు అయిదో బంతికి ఊపు మీదున్న గేల్‌ను కూడా ఔట్‌ చేశాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో అశ్విన్‌ కూడా ఇలాంటి బంతే ఒకటి వేశాడు.

ఆ వికెట్‌తో కల నిజమైంది..

అవేశ్ ఖాన్

మహేంద్రసింగ్‌ ధోనీ వికెట్‌ తీయాలన్న తన కల నెరవేరినందుకు ఆనందంగా ఉందని దిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ అవేశ్‌ఖాన్‌ చెప్పాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోరులో ధోనీని 24 ఏళ్ల అవేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. "మూడేళ్ల క్రితం మహీ భాయ్‌ వికెట్‌ తీసే అవకాశం కొద్దిలో చేజారింది. అప్పుడు ఫీల్డర్‌ క్యాచ్‌ వదిలేశాడు. కానీ ఈ ఐపీఎల్‌లో అతడి వికెట్‌ పడగొట్టాను. దీంతో నా కల నెరవేరింది" అని అవేశ్‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ధోనీ, డుప్లెసిస్‌ వికెట్లు తీయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ ఇండోర్‌ పేసర్‌ తెలిపాడు. "కెప్టెన్‌ పంత్‌ నా మీద నమ్మకముంచి మ్యాచ్‌లో రెండో ఓవర్‌ అప్పగించాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ను ఔట్‌ చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది" అని అవేశ్‌ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:బూట్లు లేని స్థితి నుంచి ఐపీఎల్​లో అదరగొట్టి..

ABOUT THE AUTHOR

...view details