తెలంగాణ

telangana

ETV Bharat / sports

హైదరాబాద్-రాజస్థాన్​ మ్యాచ్​లో పట్టుబడ్డ బుకీలు! - బుకీలను అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

అరుణ్​ జైట్లీ స్టేడియంలో మే 2న హైదరాబాద్-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇద్దరు బుకీలు మైదానంలోకి ప్రవేశించారు. నకిలీ అక్రిడేషన్ కార్డులపై మైదానంలోకి ప్రవేశించిన వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

The bookies participated in the match between Hyderabad and Rajasthan, ipl
హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్​లో బుకీలు, ఐపీఎల్​లో బుకీలు

By

Published : May 5, 2021, 10:44 AM IST

Updated : May 5, 2021, 11:15 AM IST

ఐపీఎల్​లో మే 2న సన్​రైజర్స్​ హైదరాబాద్​-రాజస్థాన్ రాయల్స్​ మధ్య జరిగిన మ్యాచ్​కు అరుణ్​ జైట్లీ స్టేడియంలోకి ఇద్దరు బుకీలు ప్రవేశించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నకిలీ అక్రిడేషన్​ కార్డులతో వారిద్దరూ మైదానంలో ప్రవేశించారని వెల్లడించారు. వారిలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా.. 5 రోజుల రిమాండ్​ విధించినట్లు పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే?

సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య మే 2 తేదీ(ఆదివారం) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​ సందర్భంగా ఇద్దరు అనుమానస్పద వ్యక్తులు స్టేడియంలోకి రావడం పోలీసులు గమనించారు. వారిద్దరి గురించి తెలుసుకోగా బుకీలు అని తెలిసింది. ఆ ఇద్దరు బుకీలు నకిలీ కార్డుల ద్వారా స్టేడియంలోకి వచ్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్​కు తరలిచింది. అయితే ఆ నిందుతులు ఎందుకు స్టేడియంలోకి వచ్చారనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చదవండి:మాజీ క్రికెటర్​ కిడ్నాప్.. విడుదల!

Last Updated : May 5, 2021, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details