తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఉమ్రాన్‌ మాలిక్‌ ఎదిగేలా మద్దతు ఇవ్వాలి' - umran malik latest news

టీమ్​ఇండియా టెస్ట్​ స్పెషలిస్ట్​ ఛెతేశ్వర్‌ పుజారా, సన్​రైజర్స్​ హైదరాబాద్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్. ఇద్దరిని జట్టులోకి తీసుకోవడం శుభపరిణామం అన్నారు.

msk prasad
ఎంఎస్‌కే ప్రసాద్

By

Published : May 25, 2022, 6:59 AM IST

సన్​రైజర్స్ హైదరాబాద్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ను టీమ్‌ఇండియా జట్టులోకి తీసుకోవడం మంచి పరిణామమని బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్ అభినందించాడు. అలానే అతడిని ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించాడు. ఛెతేశ్వర్‌ పుజారా మళ్లీ టెస్టు జట్టులోకి రావడం నమ్మశక్యంగా లేదన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై శ్రీలంకతోనూ జట్టులో స్థానం కోల్పోయిన పుజారా ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టాడు. దీంతో మరోసారి టెస్టు జట్టులోకి పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఉమ్రాన్‌, పుజారా జట్టులోకి రావడంపై ఎంఎస్‌కే మాట్లాడాడు.

''పుజారా రాకపై ఒకే మాట చెప్పగలను. ఇది నమ్మశక్యం కానిది. ఇంతే ఇంకేమీ చెప్పలేను. ఆటపట్ల ఉన్న కమిట్‌మెంట్‌ పుజారాలో కనిపిస్తోంది. దీని కోసం పుజారా చేసిన కృషి చాలా మంది నమ్మరు. కౌంటీల్లో చెలరేగడంతో టెస్టు జట్టులోకి అవకాశం వచ్చింది. అతడు ఎప్పుడూ టెస్టు క్రికెటర్‌గానే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం చెందాక పుజారా మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే దీనికోసం పుజారా చాలా కష్టపడ్డాడు. కాబట్టి కచ్చితంగా పుజారా మరికొన్ని సంవత్సరాల పాటు టెస్టు క్రికెట్ ఆడతాడు. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ ఎదిగేలా మద్దతు ఇవ్వాలి. ఆసీస్, ఇంగ్లాండ్‌ పిచ్‌లకు మాలిక్ పేస్‌ చాలా చక్కగా సరిపోతుంది'' అని ఎంఎస్‌కే ప్రసాద్ వివరించాడు.

ఇదీ చదవండి:IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్​కు గుజరాత్​.. రాజస్థాన్​పై గెలుపు

ABOUT THE AUTHOR

...view details