పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం - ఐపీఎల్ 2021
18:54 April 21
పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం
పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 9 వికెట్ల తేడాతో టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది వార్నర్‌సేన.ఐపీఎల్లో చెన్నై వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 9 వికెట్ల తేడాతో నెగ్గిన వార్నర్ సేన.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 121 పరుగులే లక్ష్యంగా బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోయి ఛేదించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37) బ్యాటింగ్‌లో శుభారంభాన్నిచ్చాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన విలియమ్సన్(16)తో కలిసి బెయిర్‌స్టో(63) అర్ధశతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల పంజాబ్ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. దాంతో పంజాబ్ ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు (ఇప్పటివరకు) నమోదుచేసిన జట్టుగా నిలిచింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (22), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీన్ని బట్టి చూస్తే సన్‌రైజర్స్ బౌలర్లు ఎలా చెలరేగారో అర్థమవుతుంది. ఖలీల్ అహ్మద్ 3/21, అభిషేక్ శర్మ 2/24 రాణించారు. ఇక భువనేశ్వర్, సిద్ధార్థ్, రషీద్‌ఖాన్ తలో వికెట్ తీశారు