IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా.. మ్యాచ్ మాత్రం యథావిధిగా - సన్‌రైజర్స్ హైదరాబాద్
15:05 September 22
IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా.. మ్యాచ్ మాత్రం యథావిధిగా
ఐపీఎల్లో(IPL 2021) మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సన్‌రైజర్స్ జట్టులోని ప్రధాన బౌలర్ నటరాజన్(Natarajan IPL) వైరస్ బారిన పడ్డాడు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆరుగురు ప్రస్తుతం ఐసోలేషన్‌కు ఉన్నారు. అయితే టీమ్‌లోని ఇతర ఆటగాళ్లకు కొవిడ్ నెగటివ్‌గా తేలిన నేపథ్యంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH vs DC 2021) మధ్య మ్యాచ్ యథావిధిగా జరగనుందని బీసీసీఐ పేర్కొంది.
ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, విజయ్ కుమార్(టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్ జే(ఫిజియోథెరపిస్ట్), అంజనా వన్నన్(డాక్టర్), తుషార్ ఖేడ్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేశన్(నెట్ బౌలర్).. నటరాజన్‌కు సన్నిహితంగా మెదిలినట్లు సన్‌రైజర్స్ మెడికల్ బృందం గుర్తించింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్‌లో ఉన్నారు.
మరోవైపు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా సన్‌రైజర్స్ అట్టడుగు స్థానంలో ఉంది.