రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad ipl 2021 runs) లాంటి బ్యాట్స్‌మన్‌ను చూసి భయపడ్డామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. శనివారం(సెప్టెంబరు 2) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో(chennai super kings rajasthan royals match) తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (101*) శతకంతో చెలరేగాడు.
"మా బ్యాటింగ్ లైనప్‌లోని ఆటగాళ్ల సామర్థ్యం మాకు తెలుసు. అందుకే ఓడినప్పుడల్లా కాస్త బాధ కలుగుతుంది. అలాంటప్పుడు మాకు మేమే ధైర్యం తెచ్చుకోవాలి. మా ఓపెనర్లు శుభారంభాలు అందిస్తున్నారు. వాళ్లు పవర్‌ప్లేలోనే ఈ మ్యాచ్‌పై పట్టు సాధించారు. జైశ్వాల్ ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నాడు. ఇక శివమ్ దూబే బ్యాటింగ్ గురించి కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో చెలరేగడం వల్ల ఈరోజు అతడిదే అనుకున్నాం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా ఆడాడు. అతడి ఆటతీరు చూసి భయపడ్డాం. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడటమే కాకుండా ఆడే విధానంలో ఎలాంటి రిస్కు తీసుకోడు. అలాంటి ఆటగాడిని ఎవరైనా గౌరవించాలి. రుతురాజ్ సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇక ప్లేఆఫ్స్‌కు సంబంధించి మేం పెద్దగా ఆలోచించడం లేదు. ఒక్కొక్క మ్యాచ్‌పై దృష్టిసారించి ముందుకు వెళ్లాలని చూస్తున్నాం"
-సంజూ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్.(rajasthan royals sanju samson batting)
6 ఓవర్లలోనే ఆట లాగేసుకున్నారు: ధోనీ
"మేం టాస్ ఓడటం బాగాలేదు. 190 అనేది మంచి స్కోరే. అయినా తేమ ప్రభావం చూపించడం వల్ల బంతి బ్యాట్‌పైకి దూసుకొచ్చింది. ఇలాంటి పిచ్‌పై బాగా ఆడొచ్చు. రాజస్థాన్ అదే చేసింది. మా బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. తొలి 6 ఓవర్లలోనే వాళ్ల ఓపెనర్లు మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ జట్టు ఆడిన తీరు చూస్తే మేం 250 పరుగులు చేసుంటే బాగుండేదని అనిపించింది. వాళ్ల స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్న పిచ్.. తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించింది. దీంతో రుతురాజ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ పరిస్థితులను అంచనా వేసి ఆడాలి. రాజస్థాన్ ఆటగాళ్లు అదే చేశారు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో ఇలాగే జరిగితే అప్పుడు ఉపయోగపడుతుంది"